Nee yubagaarame maagu nilise dimte kaaga

నీ యుపకారమే మాకు నిలిచే దింతే కాక
Language

(॥పల్లవి॥)
నీ యుపకారమే మాకు నిలిచే దింతే కాక
యే యెడా నీ యుదారత్వ మేమని నుతింతును

(॥నీయుప॥)
నీ కరుణ నాకే పనికివచ్చుఁ గాక మఱి
యీకడ నా భక్తి నీకు నెందు కెక్కును
కైకొని నాకు నీ రక్షకత్వము ఫలించుఁ గాక
నీకు నా సేవల వంక నిండే దేమీ

(॥నీయుప॥)
నీవు నన్ను వెదకి మన్నించేదే యెక్కుప గాక
భావించి నేఁ దలఁచే లాభము నీకేమి
దేవ నీవు చన విచ్చేదే నాకు గుఱి గాక
పూవులనేఁ బూజించఁగ పొందేది నీ కేమి

(॥నీయుప॥)
యిట్టే నీవు నాకు వర మిచ్చేదే ఘనత గాక
నెట్టన నేఁ గొలువఁగ నీ కయ్యే దెంతా
గుట్టున శ్రీవేంకటేశ కోరి నీకు శరణంటి
వట్టిన వినయమే కాక వచ్చేది నీ కేమీ

(||pallavi||)
nī yubagārame māgu nilise diṁte kāga
ye yĕḍā nī yudāratva memani nudiṁtunu

(||nīyuba||)
nī karuṇa nāge panigivachchum̐ gāga maṟi
yīgaḍa nā bhakti nīgu nĕṁdu kĕkkunu
kaigŏni nāgu nī rakṣhagatvamu phaliṁchum̐ gāga
nīgu nā sevala vaṁka niṁḍe demī

(||nīyuba||)
nīvu nannu vĕdagi manniṁchede yĕkkuba gāga
bhāviṁchi nem̐ dalam̐se lābhamu nīgemi
deva nīvu sana vichchede nāgu guṟi gāga
pūvulanem̐ būjiṁcham̐ga pŏṁdedi nī kemi

(||nīyuba||)
yiṭṭe nīvu nāgu vara michchede ghanada gāga
nĕṭṭana nem̐ gŏluvam̐ga nī kayye dĕṁtā
guṭṭuna śhrīveṁkaḍeśha kori nīgu śharaṇaṁṭi
vaṭṭina vinayame kāga vachchedi nī kemī