నీ యిచ్చ రాజవు తొల్లే నీవు మ మ్మే లొరసేవు
(॥పల్లవి॥)
నీ యిచ్చ రాజవు తొల్లే నీవు మ మ్మే లొరసేవు
చాయ కొత్తి నీ గుణాలు చక్కఁ బెట్టేమా
(॥॥)
వొద్దికైన మాటలకు వూఁకొనఁ గవచ్చుఁగాక
పొద్దువోని మాట లెల్లా బుద్దిఁ బట్టీనా
చద్దికి వేఁడికి నీవు జాణతనా లెన్నాడినా
వద్దనేమా వూరకుండేవార మింతేకాక
(॥॥)
యితవైన పనులకు నియ్యకొనవచ్చుఁ గాక
రతి కెక్కని పనులు గతి గూడీనా
మతకారి తనమున మరి నీ వెంత నవ్వినా
మితిమీరేమా నీ యిచ్చ మెలఁగేము గాకా
(॥॥)
కూడిన వేడుకలకు గుఱిగాఁగవచ్చుఁగాక
యేడ కేడో వేడుకల కింపు వుట్టీనా
వీడె మిచ్చి నన్ను శ్రీ వేంకటేశ యేలితివి
ఆడుకొని సొలసేమా అవు ననేము గాకా
(||pallavi||)
nī yichcha rājavu tŏlle nīvu ma mme lŏrasevu
sāya kŏtti nī guṇālu sakkam̐ bĕṭṭemā
(||||)
vŏddigaina māḍalagu vūm̐kŏnam̐ gavachchum̐gāga
pŏdduvoni māḍa lĕllā buddim̐ baṭṭīnā
saddigi vem̐ḍigi nīvu jāṇadanā lĕnnāḍinā
vaddanemā vūraguṁḍevāra miṁtegāga
(||||)
yidavaina panulagu niyyagŏnavachchum̐ gāga
radi kĕkkani panulu gadi gūḍīnā
madagāri tanamuna mari nī vĕṁta navvinā
midimīremā nī yichcha mĕlam̐gemu gāgā
(||||)
kūḍina veḍugalagu guṟigām̐gavachchum̐gāga
yeḍa keḍo veḍugala kiṁpu vuṭṭīnā
vīḍĕ michchi nannu śhrī veṁkaḍeśha yelidivi
āḍugŏni sŏlasemā avu nanemu gāgā