నీ యిచ్చ మేలఁగే నంటా నిలుచున్న దూరకే
(॥పల్లవి॥)
నీ యిచ్చ మేలఁగే నంటా నిలుచున్న దూరకే
చాయల నేమేమో భావించకువయ్యా యీపెను
(॥॥)
కూరిమి గలుగు కాంత కోపగించదు
వోరుపుతో గుట్టు సేసు కుండుఁ గాని
యీ రీతి వోజలదే మా యిగురుఁ బోఁడి
సారె నలుకలు గడించకువయ్యా యీపెకు
(॥॥)
మంచి గుణాల మగువ మంకు చూపదు
వంచన తోనే మెలఁగి వసమౌఁ గాని
యెంచా చూడ నేరుపరి యిదె మా చెలి
అంచెల వట్టి సడి వేయకువయ్యా యీపెకు
(॥॥)
తగ వెఱిఁ గిన సతి తత్తరించదు
మొగ మోటతో నీకు మొక్కుఁగాని
జిగి నిట్టిది మా కన్నె శ్రీ వేంకటేశ
బగివాయదు జోలి చూపకువయ్యా యీపెకు
(||pallavi||)
nī yichcha melam̐ge naṁṭā nilusunna dūrage
sāyala nememo bhāviṁchaguvayyā yībĕnu
(||||)
kūrimi galugu kāṁta kobagiṁchadu
vorubudo guṭṭu sesu kuṁḍum̐ gāni
yī rīdi vojalade mā yigurum̐ bom̐ḍi
sārĕ nalugalu gaḍiṁchaguvayyā yībĕgu
(||||)
maṁchi guṇāla maguva maṁku sūbadu
vaṁchana tone mĕlam̐gi vasamaum̐ gāni
yĕṁchā sūḍa nerubari yidĕ mā sĕli
aṁchĕla vaṭṭi saḍi veyaguvayyā yībĕgu
(||||)
taga vĕṟim̐ gina sadi tattariṁchadu
mŏga moḍado nīgu mŏkkum̐gāni
jigi niṭṭidi mā kannĕ śhrī veṁkaḍeśha
bagivāyadu joli sūbaguvayyā yībĕgu