Nee yedudam daanu vachchi nilusunnadi

నీ యెదుటఁ దాను వచ్చి నిలుచున్నది
Language

(॥పల్లవి॥)
నీ యెదుటఁ దాను వచ్చి నిలుచున్నది
యేయెడా నిల్లాండ్లకు నిది వోజగాదా

(॥నీయె॥)
తలఁపులో నీరాక తరుణి తలఁచఁగానే
వెలయ నీడ కింతలో విచ్చేసితివి
ఆలపు వాయ మజ్జన మవధరి చారగించు
చెలియ చెప్పసిగ్గువడి చెప్ప మనీ నన్నును

(॥నీయె॥)
నీ కెదురుచూడఁగానే నెలఁతభాగ్యవశాన
దాకొని నీయంతనే ప్రత్యక్షమైతివి
నీ కిదివో పుత్తెంచె నెమ్మది విడె మందుకో
యీకె సిగ్గువడి యిమ్మఁనీ నన్నును

(॥నీయె॥)
కాంత నిన్నుఁబిలువఁ గానుక లంపఁగానే
అంతలో ముందర నిల్చి యందుకొంటిని
సంతసాన శ్రీవేంకటేశ్వర నిన్నుఁ గూడి తాను
కొంత సిగ్గువడి నన్నుఁ గోరి మెచ్చు మనీని

(||pallavi||)
nī yĕduḍam̐ dānu vachchi nilusunnadi
yeyĕḍā nillāṁḍlagu nidi vojagādā

(||nīyĕ||)
talam̐pulo nīrāga taruṇi talam̐sam̐gāne
vĕlaya nīḍa kiṁtalo vichchesidivi
ālabu vāya majjana mavadhari sāragiṁchu
sĕliya sĕppasigguvaḍi sĕppa manī nannunu

(||nīyĕ||)
nī kĕdurusūḍam̐gāne nĕlam̐tabhāgyavaśhāna
dāgŏni nīyaṁtane pratyakṣhamaidivi
nī kidivo puttĕṁchĕ nĕmmadi viḍĕ maṁdugo
yīgĕ sigguvaḍi yimmam̐nī nannunu

(||nīyĕ||)
kāṁta ninnum̐biluvam̐ gānuga laṁpam̐gāne
aṁtalo muṁdara nilsi yaṁdugŏṁṭini
saṁtasāna śhrīveṁkaḍeśhvara ninnum̐ gūḍi tānu
kŏṁta sigguvaḍi nannum̐ gori mĕchchu manīni