Nee yedagu namtesi ne mobamu

నీ యెడకు నంతేసి నే మోపము
Language

(॥పల్లవి॥)
నీ యెడకు నంతేసి నే మోపము
దాయిదండగా నవే తలఁచుకోరాదా

(॥నీయె॥)
వోటలేక యెవ్వతో నిన్వొక చోటఁ దిట్టితేను
మాఁటలు నేర్చుకవచ్చి మమ్ము దిట్టేవు
పేటలుగ నీకు నవే ప్రియములైతేఁ గనక
చీటికి మాటికి కొండసెలఁ దిట్టరాదా

(॥నీయె॥)
తొలుత మరి నెవ్వతో తురుము నిన్నుఁ బట్టితే
కొలఁది మీరఁగ మా కొప్పు వట్టేవు
యెలమి నవే నీకు యితవులైతేఁ గనక
పొలసి మొగళ్లెక్కి పూవులు గోయరాదా

(॥నీయె॥)
నలిగా నందరిచేత నవ్వించుకొని వచ్చి
అలమేల్మంగను నన్ను అట్టె నవ్వేవు
కలసితిమి శ్రీ వేంకటేశుఁడ వేడుకైతే
సొలసి యద్దమునీడ చూచి నవ్వరాదా

(||pallavi||)
nī yĕḍagu naṁtesi ne mobamu
dāyidaṁḍagā nave talam̐sugorādā

(||nīyĕ||)
voḍalega yĕvvado ninvŏga soḍam̐ diṭṭidenu
mām̐ṭalu nersugavachchi mammu diṭṭevu
peḍaluga nīgu nave priyamulaidem̐ ganaga
sīḍigi māḍigi kŏṁḍasĕlam̐ diṭṭarādā

(||nīyĕ||)
tŏluda mari nĕvvado turumu ninnum̐ baṭṭide
kŏlam̐di mīram̐ga mā kŏppu vaṭṭevu
yĕlami nave nīgu yidavulaidem̐ ganaga
pŏlasi mŏgaḽlĕkki pūvulu goyarādā

(||nīyĕ||)
naligā naṁdariseda navviṁchugŏni vachchi
alamelmaṁganu nannu aṭṭĕ navvevu
kalasidimi śhrī veṁkaḍeśhum̐ḍa veḍugaide
sŏlasi yaddamunīḍa sūsi navvarādā