నీ యంతా నెఱఁగవు నేముచెప్పినా వినవు
(॥పల్లవి॥)
నీ యంతా నెఱఁగవు నేముచెప్పినా వినవు
పాయముగల యందుకు ఫలమా ఇది
(॥నీయం॥)
పట్టినదే చలమా పడఁతి నీ వాతనితో
చుట్టరికము సేసితే సూడువట్టేవా
బట్టబయలఁదించేవు పలుకుల సారెసారె
గుట్టుతోడిసతులకు గుణమా ఇది
(॥నీయం॥)
చెనకితే సెలవా చెమరించే వంతలోనె
పెనఁగఁగానే అలసి బిగిసేవు
తనిసేవు నవ్ములనే తను విది మీఁదమీఁద
చనవుగలయందుకు చందమా ఇది
(॥నీయం॥)
సేసినదే చేఁతా శ్రీవేంకటేశుకాఁగిట
సేసవెట్టంగానే గోరఁ జెక్కునొక్కేవు
రాసినేసేవు వలపు రతులతో నెల్లా నీవు
పోసరపువేడుకకు భోగమా యిది
(||pallavi||)
nī yaṁtā nĕṟam̐gavu nemusĕppinā vinavu
pāyamugala yaṁdugu phalamā idi
(||nīyaṁ||)
paṭṭinade salamā paḍam̐ti nī vādanido
suṭṭarigamu seside sūḍuvaṭṭevā
baṭṭabayalam̐diṁchevu palugula sārĕsārĕ
guṭṭudoḍisadulagu guṇamā idi
(||nīyaṁ||)
sĕnagide sĕlavā sĕmariṁche vaṁtalonĕ
pĕnam̐gam̐gāne alasi bigisevu
tanisevu navmulane tanu vidi mīm̐damīm̐da
sanavugalayaṁdugu saṁdamā idi
(||nīyaṁ||)
sesinade sem̐tā śhrīveṁkaḍeśhugām̐giḍa
sesavĕṭṭaṁgāne goram̐ jĕkkunŏkkevu
rāsinesevu valabu radulado nĕllā nīvu
posarabuveḍugagu bhogamā yidi