నీ వున్నచోటే నిత్యము నిఖిలమైనవారికి
(॥పల్లవి॥)
నీ వున్నచోటే నిత్యము నిఖిలమైనవారికి
శ్రీవల్లభ కోరి నిలిచిరి సనకాదులు
(॥నీవు॥)
పట్టపగలులోననే పద్నలుగురు దేవేంద్రు
లెట్టు గాఁపురము సేసే దింద్రలోకమున
తెట్ట దెరువుననే దిక్కులవారు చూడంగ
చుట్టుకుండు టెట్లు చంద్రసూర్యలోకములా
(॥నీవు॥)
యెంచి చూడ బ్రహ్మదేవుఁ డేండ్లు నూరిటివాండ్లు
పంచల నెట్లుండేది బ్రహ్మలోకమున
పొంచి వుండఁగోరితే నెప్పుడుఁ బాములతోఁ బొత్తు
వంచనఁ బాతళలోకవాస మేమి బాఁతి
(॥నీవు॥)
యీటువెట్టితే వితరు లిందుకంటె దిగ్గుడి
నాటుకొని యెట్టుండేది నానాలోకములా
మేటివి శ్రీవేంకటేశ మేమెల్లా నీ బంట్లము
చాటువఁగొనేటి దండ సత మైతి విపుడు
(||pallavi||)
nī vunnasoḍe nityamu nikhilamainavārigi
śhrīvallabha kori nilisiri sanagādulu
(||nīvu||)
paṭṭabagalulonane padnaluguru deveṁdru
lĕṭṭu gām̐puramu sese diṁdralogamuna
tĕṭṭa dĕruvunane dikkulavāru sūḍaṁga
suṭṭuguṁḍu ṭĕṭlu saṁdrasūryalogamulā
(||nīvu||)
yĕṁchi sūḍa brahmadevum̐ ḍeṁḍlu nūriḍivāṁḍlu
paṁchala nĕṭluṁḍedi brahmalogamuna
pŏṁchi vuṁḍam̐goride nĕppuḍum̐ bāmuladom̐ bŏttu
vaṁchanam̐ bādaḽalogavāsa memi bām̐ti
(||nīvu||)
yīḍuvĕṭṭide vidaru liṁdugaṁṭĕ digguḍi
nāḍugŏni yĕṭṭuṁḍedi nānālogamulā
meḍivi śhrīveṁkaḍeśha memĕllā nī baṁṭlamu
sāḍuvam̐gŏneḍi daṁḍa sada maidi vibuḍu