నీ వుండే దొక్కయంగము నే నుండే దొక్కయంగము
(॥పల్లవి॥)
నీ వుండే దొక్కయంగము నే నుండే దొక్కయంగము
కైవశమైతివి యింకఁ గతలెల్లాఁ జెల్లును
(॥నీవుఁ॥)
సిగ్గువిడిచేయాఁటది చేతులఁ బట్టఁగరాదు
యెగ్గులేదు మగవాని కెట్టుండినాను
వొగ్గినేను మేరతోనే వున్నచో నుందానను
బగ్గన నీకంతటాను పారాడఁజెల్లును
(॥నీవుఁ॥)
పొంచి యణఁకువలేనిపొలఁతి దేఁటిగుణము
వంచనలేకున్నా మగవాని కమరు
మంచముపై నిట్టె నెమ్మది నే నుందానను
యెంచఁగ రచ్చలు సేయ నిటు నీకుఁ జెల్లును
(॥నీవు॥)
గుట్టుతో నుండకుంటేను కోమలి కేఁటివొరపు
వట్టిరట్టు మగవానివద్దనే కద్దు
ఇట్టె శ్రీవేంకటేశ ఇటు నిన్ను నేఁ గూడితి
ముట్టి యెంతైనా నీవు మోహించఁజెల్లును
(||pallavi||)
nī vuṁḍe dŏkkayaṁgamu ne nuṁḍe dŏkkayaṁgamu
kaivaśhamaidivi yiṁkam̐ gadalĕllām̐ jĕllunu
(||nīvum̐||)
sigguviḍiseyām̐ṭadi sedulam̐ baṭṭam̐garādu
yĕgguledu magavāni kĕṭṭuṁḍinānu
vŏgginenu meradone vunnaso nuṁdānanu
baggana nīgaṁtaḍānu pārāḍam̐jĕllunu
(||nīvum̐||)
pŏṁchi yaṇam̐kuvalenibŏlam̐ti dem̐ṭiguṇamu
vaṁchanalegunnā magavāni kamaru
maṁchamubai niṭṭĕ nĕmmadi ne nuṁdānanu
yĕṁcham̐ga rachchalu seya niḍu nīgum̐ jĕllunu
(||nīvu||)
guṭṭudo nuṁḍaguṁṭenu komali kem̐ṭivŏrabu
vaṭṭiraṭṭu magavānivaddane kaddu
iṭṭĕ śhrīveṁkaḍeśha iḍu ninnu nem̐ gūḍidi
muṭṭi yĕṁtainā nīvu mohiṁcham̐jĕllunu