Nee voyyaaribhaavamu nelamtalu pogaderu

నీ వొయ్యారిభావము నెలఁతలు పొగడేరు
Language

(॥పల్లవి॥)
నీ వొయ్యారిభావము నెలఁతలు పొగడేరు
చేవదేర నీకు నిన్నీఁ జెల్లునే చెలియా

(॥నీవో॥)
గుత్తపుగుబ్బలమీఁదికుంకుమగందపుఁబూఁత
చిత్తరువుమీఁదటి చేతులవాఁత
హత్తినపెంజెమటలఅంగపునీనిలువీఁత
కొత్తలేడఁ గడియించుకొంటివే చెలియా

(॥నీవో॥)
వున్నతపు కొప్పమీఁద నోనరేముత్యాల సేస
చిన్ని పెదవులమీఁది చిలుకబాస
కన్నుల విభునిఁ జూచేకడ లేని యడియాస
అన్ని వేడుకలు నీకు నమరునే చెలియా

(॥నీవో॥)
చతురత చెక్కుపై జవ్వాదికరఁగులు
కతలాయ నీరతి మైకరఁగులు
అతఁడు శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
మితిలేక నిన్నుఁ గూడె మేలుమేలే చెలియా

(||pallavi||)
nī vŏyyāribhāvamu nĕlam̐talu pŏgaḍeru
sevadera nīgu ninnīm̐ jĕllune sĕliyā

(||nīvo||)
guttabugubbalamīm̐diguṁkumagaṁdabum̐būm̐ta
sittaruvumīm̐daḍi sedulavām̐ta
hattinabĕṁjĕmaḍalaaṁgabunīniluvīm̐ta
kŏttaleḍam̐ gaḍiyiṁchugŏṁṭive sĕliyā

(||nīvo||)
vunnadabu kŏppamīm̐da nonaremutyāla sesa
sinni pĕdavulamīm̐di silugabāsa
kannula vibhunim̐ jūsegaḍa leni yaḍiyāsa
anni veḍugalu nīgu namarune sĕliyā

(||nīvo||)
sadurada sĕkkubai javvādigaram̐gulu
kadalāya nīradi maigaram̐gulu
adam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavu nīvu
midilega ninnum̐ gūḍĕ melumele sĕliyā