Nee vollide kallagaaga nelamta yemisesu

నీ వొళ్ళిదే కల్లగాక నెలఁత యేమిచేసు
Language

(॥పల్లవి॥)
నీ వొళ్ళిదే కల్లగాక నెలఁత యేమిచేసు
యే విధమైనానాయ నేమి సేయవచ్చును

(॥నీవో ॥)
గుట్టుతోడియాటదానిఁ గొంగువట్టి తియ్యఁబోతే
తిట్టవద్దా యాపె నిన్ను దిష్టముగాను
పొట్టఁ బొరుగాపెతోను పూఁచి నవ్వఁబోతేను
యెట్టు చేసినాఁ జేసె యేమి సేయవచ్చును

(॥నీవో॥)
వోరుపుది గలదియంటా వొకటొకటాడితేను
గీరవద్దా ఆపె నీ మై కేరడానను
వూరిలోనిసతి నీవు వొంటినుండి పిల్చితేను
యేరీతి మీరినా మీరె నేమిసేయవచ్చును

(॥నీవో॥)
చెప్పినట్టు సేసునంటా సిగ్గులువరచితేను
తప్పు లెంచవద్దా నిన్ను దమకానను
అప్పడే శ్రీవేంకటేశ ఆపె నిట్టె కూడితివి
యెప్పుడు మెచ్చినా మెచ్చె నేమిసేయవచ్చును

(||pallavi||)
nī vŏḽḽide kallagāga nĕlam̐ta yemisesu
ye vidhamainānāya nemi seyavachchunu

(||nīvo ||)
guṭṭudoḍiyāḍadānim̐ gŏṁguvaṭṭi tiyyam̐bode
tiṭṭavaddā yābĕ ninnu diṣhṭamugānu
pŏṭṭam̐ bŏrugābĕdonu pūm̐si navvam̐bodenu
yĕṭṭu sesinām̐ jesĕ yemi seyavachchunu

(||nīvo||)
vorubudi galadiyaṁṭā vŏgaḍŏgaḍāḍidenu
gīravaddā ābĕ nī mai keraḍānanu
vūrilonisadi nīvu vŏṁṭinuṁḍi pilsidenu
yerīdi mīrinā mīrĕ nemiseyavachchunu

(||nīvo||)
sĕppinaṭṭu sesunaṁṭā sigguluvarasidenu
tappu lĕṁchavaddā ninnu damagānanu
appaḍe śhrīveṁkaḍeśha ābĕ niṭṭĕ kūḍidivi
yĕppuḍu mĕchchinā mĕchchĕ nemiseyavachchunu