నీ వొళ్లి చేఁతలు నీవు చూచుకొనవు
(॥పల్లవి॥)
నీ వొళ్లి చేఁతలు నీవు చూచుకొనవు
యీవల నన్నుఁ బొదిగే మేమందు నిఁకను
(॥నీవొ॥)
పెదవికెంపులు రేఁగఁబ్రియములు చెప్పేవు
వెదచల్లునూర్పులతో వేఁడుకొనేవు
మదము దొలఁకఁగాను మచ్చికలు చల్లేవు
యెదుల నిన్నుఁ జూచి యేమందు నిఁకను
(॥నీవొ॥)
వాడుఁబువ్వులు గాలఁగా వచ్చి నాతోఁ బెనఁగేవు
వీడెపు సెలవులతో విందచెప్పేవు
జాడతోడ వలపుల సరసములాడేవు
యీడ నీసముకలమున నేమందు నిఁకను
(॥నీవొ॥)
గందవొడి మైరాలఁగా కాఁగిలించి కూడేవు
సందుకొని మోవితేనె చవిగొనేవు
చిందేటిచెమటతోడ సిగ్గువడక నవ్వేవు
యిందుకు శ్రీవేంకటేశ యేమందు నిఁకను
(||pallavi||)
nī vŏḽli sem̐talu nīvu sūsugŏnavu
yīvala nannum̐ bŏdige memaṁdu nim̐kanu
(||nīvŏ||)
pĕdavigĕṁpulu rem̐gam̐briyamulu sĕppevu
vĕdasallunūrbulado vem̐ḍugŏnevu
madamu dŏlam̐kam̐gānu machchigalu sallevu
yĕdula ninnum̐ jūsi yemaṁdu nim̐kanu
(||nīvŏ||)
vāḍum̐buvvulu gālam̐gā vachchi nādom̐ bĕnam̐gevu
vīḍĕbu sĕlavulado viṁdasĕppevu
jāḍadoḍa valabula sarasamulāḍevu
yīḍa nīsamugalamuna nemaṁdu nim̐kanu
(||nīvŏ||)
gaṁdavŏḍi mairālam̐gā kām̐giliṁchi kūḍevu
saṁdugŏni movidenĕ savigŏnevu
siṁdeḍisĕmaḍadoḍa sigguvaḍaga navvevu
yiṁdugu śhrīveṁkaḍeśha yemaṁdu nim̐kanu