Nee volli nera memchavu neme kallalamanevu

నీ వొళ్లి నేర మెంచవు నేమే కల్లలమనేవు
Language

(॥పల్లవి॥)
నీ వొళ్లి నేర మెంచవు నేమే కల్లలమనేవు
తావుకు విచ్చేయుమా తారుకాణించేము

(॥నీవొ॥)
మావంటివారిమాట మనసునఁ బట్టకుంటే
ఆవలికి రావయ్యా ఆపె ఆడీని
కావించి నేనిచ్చినట్టికమ్మ నీవు నమ్మకుంటే
వావిరి నీవడుగుమా వాసి చూపీని

(॥నీవొ॥)
వూడిగపువారి మొక్కు లొల్లఁబే ట్లైతేను
ఆడకే రమ్మా నీకు నాపె మొక్కీని
యీడ నేము వెట్టేఆన లియ్యకోలుగాకుంటే
తోడనే విచ్చేయుమా తొయ్యలిచే వినేవు

(॥నీవొ॥)
ఇచ్చిన మాచేకానుక లింపులు నీకుఁ గాకుంటే
అచ్చటికి రమ్మా చెలి ఆపె యిచ్చీని
ఇచ్చల శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
అచ్చుగా నీ వేకతము లాడుమా విన్నవించీని

(||pallavi||)
nī vŏḽli nera mĕṁchavu neme kallalamanevu
tāvugu vichcheyumā tārugāṇiṁchemu

(||nīvŏ||)
māvaṁṭivārimāḍa manasunam̐ baṭṭaguṁṭe
āvaligi rāvayyā ābĕ āḍīni
kāviṁchi nenichchinaṭṭigamma nīvu nammaguṁṭe
vāviri nīvaḍugumā vāsi sūbīni

(||nīvŏ||)
vūḍigabuvāri mŏkku lŏllam̐be ṭlaidenu
āḍage rammā nīgu nābĕ mŏkkīni
yīḍa nemu vĕṭṭeāna liyyagolugāguṁṭe
toḍane vichcheyumā tŏyyalise vinevu

(||nīvŏ||)
ichchina māsegānuga liṁpulu nīgum̐ gāguṁṭe
achchaḍigi rammā sĕli ābĕ yichchīni
ichchala śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
achchugā nī vegadamu lāḍumā vinnaviṁchīni