Nee vollam gallalegumte nimduga vumduvugaaga

నీ వొళ్ళఁ గల్లలేకుంటే నిండుక వుందువుగాక
Language

(॥పల్లవి॥)
నీ వొళ్ళఁ గల్లలేకుంటే నిండుక వుందువుగాక
చేవదేరి వుండఁగాను సిగ్గువడ నేఁటికి

(॥॥)
మొగము చూచి చెలి మొక్కలు నీకు మొక్కఁగా-
నెగసక్కేలంటా నేల యెంచుకొనేవు
నగుతా నాపె నిన్ను నాయము లడుఁగఁగాను
వెగటువెంగేలంటా వీఁగఁగ నేమిటికి

(॥॥)
మక్కువతో నేడలేనిమాట లింతి యాడఁగాను
వెక్కసము లందులో భావించి చూచేవు
యిక్కువ నాపె నీకు నిచ్చకములు, చూపఁగ
పక్కన నొరపు లట్టె పట్టఁగ నేమిటికి

(॥॥)
మనసిచ్చిన సతి నీ మర్మములు ముట్టఁగాను
తనివోని సిగ్గుతోడఁ దలవంచేవు
ఘనుఁడ శ్రీ వేంకటేశ కందువ నన్నేలితివి
పెనఁగీఁ గాఁగిట నాపె బిగువులేమిటికి

(||pallavi||)
nī vŏḽḽam̐ gallaleguṁṭe niṁḍuga vuṁduvugāga
sevaderi vuṁḍam̐gānu sigguvaḍa nem̐ṭigi

(||||)
mŏgamu sūsi sĕli mŏkkalu nīgu mŏkkam̐gā-
nĕgasakkelaṁṭā nela yĕṁchugŏnevu
nagudā nābĕ ninnu nāyamu laḍum̐gam̐gānu
vĕgaḍuvĕṁgelaṁṭā vīm̐gam̐ga nemiḍigi

(||||)
makkuvado neḍalenimāḍa liṁti yāḍam̐gānu
vĕkkasamu laṁdulo bhāviṁchi sūsevu
yikkuva nābĕ nīgu nichchagamulu, sūbam̐ga
pakkana nŏrabu laṭṭĕ paṭṭam̐ga nemiḍigi

(||||)
manasichchina sadi nī marmamulu muṭṭam̐gānu
tanivoni siggudoḍam̐ dalavaṁchevu
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kaṁduva nannelidivi
pĕnam̐gīm̐ gām̐giḍa nābĕ biguvulemiḍigi