Nee vollam gadamaledu nerubarivi nauduvu

నీ వొళ్ళఁ గడమలేదు నేరుపరివి నౌదువు
Language

(॥పల్లవి॥)
నీ వొళ్ళఁ గడమలేదు నేరుపరివి నౌదువు
యీవేళ నీ మగఁడు నిన్నేమనీనోకాని

(॥నీవొళ్ళఁ॥)
చీరాఁ గట్టుకొంటివి సింగారించుకొంటివి
బీరముతోఁ బెద్దకొప్పు వెట్టుకొంటవి
గారవానఁ గన్నులను కాటుక దిద్దుకొంటివి
కోరి నీ మగఁ డెప్పుడు గూడీనోకాని

(॥నీవొళ్ళఁ॥)
వీడెమూ వేసుకొంటివి విరులు ముడిచితివి
వేడుక సొమ్ము వెట్టుక వెలసితివి
వాడుదేరఁ గస్తూరి వన్నెగాఁ బూసుకొంటివి
యీడనే నీమగఁ డెప్పు డేలీనోకాని

(॥నీవొళ్ళఁ॥)
వచ్చితి వింటికిఁ గొంగు వల్లెవాటు వేసితివి
కొచ్చి నవ్వి పరపుపైఁ గూచుంటివి
అచ్చపు శ్రీవేంకటేశుఁ డప్పుడే నన్నుఁ గూడె
హెచ్చి యీ మగఁడే ని న్నెట్టెనసీనోకాని

(||pallavi||)
nī vŏḽḽam̐ gaḍamaledu nerubarivi nauduvu
yīveḽa nī magam̐ḍu ninnemanīnogāni

(||nīvŏḽḽam̐||)
sīrām̐ gaṭṭugŏṁṭivi siṁgāriṁchugŏṁṭivi
bīramudom̐ bĕddagŏppu vĕṭṭugŏṁṭavi
gāravānam̐ gannulanu kāḍuga diddugŏṁṭivi
kori nī magam̐ ḍĕppuḍu gūḍīnogāni

(||nīvŏḽḽam̐||)
vīḍĕmū vesugŏṁṭivi virulu muḍisidivi
veḍuga sŏmmu vĕṭṭuga vĕlasidivi
vāḍuderam̐ gastūri vannĕgām̐ būsugŏṁṭivi
yīḍane nīmagam̐ ḍĕppu ḍelīnogāni

(||nīvŏḽḽam̐||)
vachchidi viṁṭigim̐ gŏṁgu vallĕvāḍu vesidivi
kŏchchi navvi parabubaim̐ gūsuṁṭivi
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍappuḍe nannum̐ gūḍĕ
hĕchchi yī magam̐ḍe ni nnĕṭṭĕnasīnogāni