Nee vojagaa didi ni nneṟamganaa

నీ వోజగా దిది ని న్నెఱఁగనా
Language

(॥పల్లవి॥)
నీ వోజగా దిది ని న్నెఱఁగనా
బూవపు సరసా లేల పూఁచ వచ్చేవూ

(॥నీవో॥)
అంగనమొగము చూచి అప్పటప్పటికి నాతో
యెంగిలిమాటలు నేర్చి యే లాడేవు
సంగడి జాణతనాలు సతు లెల్ల నాడఁగాను
జంగిలివలపు లేల చల్ల వచ్చేవూ

(॥నీవో॥)
తరుణి అప్పణగొని తమకించి నాతోడ
యెరవుల నవ్వులు నీ వేల నవ్వేవు
వరుస వంతులవారి వాసుల గొంత రేఁచుక
పొరుగు పొరచు లేల పుయ్య వచ్చేవూ

(॥నీవో॥)
యింతి కైదండ వట్టుక యిప్పు డిట్టె నామీఁద
యింతలోనె నీ చేయి యేల వేసేవు
బంతినె శ్రీవెంకటేశ పై కొని నన్ను గూడితి
దొంతరరతుల కేల దొమ్మి సేసేవూ

(||pallavi||)
nī vojagā didi ni nnĕṟam̐ganā
būvabu sarasā lela pūm̐sa vachchevū

(||nīvo||)
aṁganamŏgamu sūsi appaḍappaḍigi nādo
yĕṁgilimāḍalu nersi ye lāḍevu
saṁgaḍi jāṇadanālu sadu lĕlla nāḍam̐gānu
jaṁgilivalabu lela salla vachchevū

(||nīvo||)
taruṇi appaṇagŏni tamagiṁchi nādoḍa
yĕravula navvulu nī vela navvevu
varusa vaṁtulavāri vāsula gŏṁta rem̐suga
pŏrugu pŏrasu lela puyya vachchevū

(||nīvo||)
yiṁti kaidaṁḍa vaṭṭuga yippu ḍiṭṭĕ nāmīm̐da
yiṁtalonĕ nī seyi yela vesevu
baṁtinĕ śhrīvĕṁkaḍeśha pai kŏni nannu gūḍidi
dŏṁtararadula kela dŏmmi sesevū