Nee voja neneramganaa nebaalela seppevu

నీ వోజ నేనెరఁగనా నెపాలేల చెప్పేవు
Language

(॥పల్లవి॥)
నీ వోజ నేనెరఁగనా నెపాలేల చెప్పేవు
వేవేలకు నాకు వింతవాఁడవా

(॥నీవో॥)
ఎప్పుడు నామోహమోరఁగవా నీకక్కడ
కప్పి యెంతపని నీకుఁ గల్గెనోకాక
నెప్పున మాయింటికి నీవు రానివాఁడవా
అప్పటి నేచుట్టాలు మాటాడుతా నీకుండిరో

(॥నీవో॥)
మలసి నన్ను నీవు మరచేటివాఁడవా
చెలులెవ్వరు పరాకుసేసిరోకాక
తలఁపు నామీఁద నీకుఁ దగిలివున్నదే కాదా
సొలసేవారిమొగాలు చూడనందుండితివో

(॥నీవో॥)
వరుస నన్నుఁజేపట్టి వదలుదువా నీవు
యిరవై నీచిత్తాననేమెంచేవో కాక
నిరతి శ్రీ వేంకటేశ నేనలమేర్ మంగను
కరుణించితి విప్పుడు గలయ వేళాయనో

(||pallavi||)
nī voja nenĕram̐ganā nĕbālela sĕppevu
vevelagu nāgu viṁtavām̐ḍavā

(||nīvo||)
ĕppuḍu nāmohamoram̐gavā nīgakkaḍa
kappi yĕṁtabani nīgum̐ galgĕnogāga
nĕppuna māyiṁṭigi nīvu rānivām̐ḍavā
appaḍi nesuṭṭālu māḍāḍudā nīguṁḍiro

(||nīvo||)
malasi nannu nīvu maraseḍivām̐ḍavā
sĕlulĕvvaru parāgusesirogāga
talam̐pu nāmīm̐da nīgum̐ dagilivunnade kādā
sŏlasevārimŏgālu sūḍanaṁduṁḍidivo

(||nīvo||)
varusa nannum̐jebaṭṭi vadaluduvā nīvu
yiravai nīsittānanemĕṁchevo kāga
niradi śhrī veṁkaḍeśha nenalamer maṁganu
karuṇiṁchidi vippuḍu galaya veḽāyano