నీ వోపిక యిఁక నేమది యెఱఁగము
(॥పల్లవి॥)
నీ వోపిక యిఁక నేమది యెఱఁగము
చేవదేరె మా చేఁతలు సుమ్మీ
(॥నీవోపకి॥)
పంతగాఁడవై బలిమి సేసితేఁ
నింతుల మింతే యేమందుము
చెంతల మాపైఁ జేతులు వేసేవు
కాంతుఁడ చన్నులు గట్లు సుమ్మీ
(॥నీవోపకి॥)
కొనబుకాఁడవై కొంగిటు వట్టిన
వనితల మేమనవచ్చు నిఁక
చెనకుచు సాములు సేసే విటువలె
కొనగోళ్లు కడుఁ గొయ్యలు సుమ్మీ
(॥నీవోపకి॥)
కొల్లకాఁడవై కూడితి విటుమము
గొల్లెతల మేమని కొసరేము
ఇల్లిదె శ్రీవేంకటేశుఁడు నవ్వేవు
పెల్లువేఁకములు పిఱుఁదులు సుమ్మీ
(||pallavi||)
nī vobiga yim̐ka nemadi yĕṟam̐gamu
sevaderĕ mā sem̐talu summī
(||nīvobagi||)
paṁtagām̐ḍavai balimi sesidem̐
niṁtula miṁte yemaṁdumu
sĕṁtala mābaim̐ jedulu vesevu
kāṁtum̐ḍa sannulu gaṭlu summī
(||nīvobagi||)
kŏnabugām̐ḍavai kŏṁgiḍu vaṭṭina
vanidala memanavachchu nim̐ka
sĕnagusu sāmulu sese viḍuvalĕ
kŏnagoḽlu kaḍum̐ gŏyyalu summī
(||nīvobagi||)
kŏllagām̐ḍavai kūḍidi viḍumamu
gŏllĕdala memani kŏsaremu
illidĕ śhrīveṁkaḍeśhum̐ḍu navvevu
pĕlluvem̐kamulu piṟum̐dulu summī