Nee vinnidaa nerbarivi ne namtesi neranu

నీ విన్నిటా నేర్పరివి నే నంతేసి నేరను
Language

(॥పల్లవి॥)
నీ విన్నిటా నేర్పరివి నే నంతేసి నేరను
మోవి గిరిపే నింతె ముంచి యేమి సేసేరా

(॥నీవి॥)
కప్పురము నోటి కిచ్చి కాఁక లెల్లా రేఁచేవు
యెప్పటివాడవె కావా యేరా నీవు
అప్పటి మంచివాఁడవై యానలు వెట్టుకొనేవు
రెప్ప లెత్తి చూచే నింతె రేసు లేమి సేసేరా

(॥నీవి॥)
అంచెలను విడె మిచ్చి ఆసలు వుట్టించేవు
మంచి చుట్టుమవె కావా మాకు నెప్పుడు
లంచము మో విచ్చె నంటా లావులనె పెనఁగేవు
మంచానకుఁ దీనే నింతె మరి యేమి సేసేరా

(॥నీవి॥)
గందవొడి మీద జల్లి కాగిలించుకొనేవు
అందగాఁడవె కావా అన్నిటా నీవు
పొందుల శ్రీవెంకటేశ భోగించితివి నన్ను
మందెమేళా లాడే నింతె మరి యేమి సేసేరా

(||pallavi||)
nī vinniḍā nerbarivi ne naṁtesi neranu
movi giribe niṁtĕ muṁchi yemi seserā

(||nīvi||)
kappuramu noḍi kichchi kām̐ka lĕllā rem̐sevu
yĕppaḍivāḍavĕ kāvā yerā nīvu
appaḍi maṁchivām̐ḍavai yānalu vĕṭṭugŏnevu
rĕppa lĕtti sūse niṁtĕ resu lemi seserā

(||nīvi||)
aṁchĕlanu viḍĕ michchi āsalu vuṭṭiṁchevu
maṁchi suṭṭumavĕ kāvā māgu nĕppuḍu
laṁchamu mo vichchĕ naṁṭā lāvulanĕ pĕnam̐gevu
maṁchānagum̐ dīne niṁtĕ mari yemi seserā

(||nīvi||)
gaṁdavŏḍi mīda jalli kāgiliṁchugŏnevu
aṁdagām̐ḍavĕ kāvā anniḍā nīvu
pŏṁdula śhrīvĕṁkaḍeśha bhogiṁchidivi nannu
maṁdĕmeḽā lāḍe niṁtĕ mari yemi seserā