నీ విన్నిటా జాణఁడవు నీకుఁ జెప్పేనా
(॥పల్లవి॥)
నీ విన్నిటా జాణఁడవు నీకుఁ జెప్పేనా
ఆవల నేమి సేసినా నదలించఁ గలనా
(॥నీవి॥)
మంతనాన నీవు నాతో మాటలాడఁగాఁ గదా
చింత లెల్లఁ బాసె నేకచిత్త మాయను
పంతగాఁడవై నీవు పరాకున వుంటేఁ గన
కాంత నింతే నే నిన్నుఁ గాదనఁగఁ గలనా
(॥నీవి॥)
యిప్పుడిట్టె నీవు మాయింటికి రాఁగాఁ గదా
తప్పు లెల్లఁ దేరి మంచితన మాయను
అప్పటిఁ దొల్లిటివలె నాడ నీడ నుంటేఁ గన
చప్పనివలపు చల్లి సాదించేనా
(॥నీవి॥)
చేరి నిన్నుఁ గాఁగిలించి చెక్కునొక్కఁగాఁ గదా
తారుకాణ వచ్చి మేను తనివొందెను
కూరిమి శ్రీ వేంకటేశ కూడితి విట్టె కన
మేర మీర యింక నిన్ను మెచ్చకుండఁ గలనా
(||pallavi||)
nī vinniḍā jāṇam̐ḍavu nīgum̐ jĕppenā
āvala nemi sesinā nadaliṁcham̐ galanā
(||nīvi||)
maṁtanāna nīvu nādo māḍalāḍam̐gām̐ gadā
siṁta lĕllam̐ bāsĕ negasitta māyanu
paṁtagām̐ḍavai nīvu parāguna vuṁṭem̐ gana
kāṁta niṁte ne ninnum̐ gādanam̐gam̐ galanā
(||nīvi||)
yippuḍiṭṭĕ nīvu māyiṁṭigi rām̐gām̐ gadā
tappu lĕllam̐ deri maṁchidana māyanu
appaḍim̐ dŏlliḍivalĕ nāḍa nīḍa nuṁṭem̐ gana
sappanivalabu salli sādiṁchenā
(||nīvi||)
seri ninnum̐ gām̐giliṁchi sĕkkunŏkkam̐gām̐ gadā
tārugāṇa vachchi menu tanivŏṁdĕnu
kūrimi śhrī veṁkaḍeśha kūḍidi viṭṭĕ kana
mera mīra yiṁka ninnu mĕchchaguṁḍam̐ galanā