Nee vinnidaa ghanumdavu ne neṟamganaa

నీ విన్నిటా ఘనుఁడవు నే నెఱఁగనా
Language

(॥పల్లవి॥)
నీ విన్నిటా ఘనుఁడవు నే నెఱఁగనా
యీవల నావల సుద్దులెల్ల నాకుఁ జెప్పేవు

(॥నీవి॥)
మంతనాన నేను నీమనసెల్లఁ గనుఁగొంటి
వింతలై నీమాటలెల్ల వేలుచుకొంటి
వంతులు వెట్టుక నీవలపెల్లఁ దెలిసితి
యెంతకెంత నీగుణము యేల మాకుఁ జెప్పేవు

(॥నీవి॥)
కడల నీవిద్యలు ఇక్కడనే విచారించితి
బడి నుండి నీలాగు భావించితి
వుడుగక నీతో నవ్వి వోరుపు విచారించితి
యెడలేక నీనేరుపు లేల నాకుఁ జెప్పేవు

(॥నీవి॥)
నిన్నుఁ గాఁగిటనే కూడి నెయ్యమెల్లాఁ జేకొంటి
చన్నుల నొత్తి నీమోవి చవిగొంటిని
యిన్నిటా శ్రీవేంకటేశ ఇచ్చకములు మెచ్చితి
యెన్నటి కిది గురుతు యేల నాకుఁ జెప్పేవు

(||pallavi||)
nī vinniḍā ghanum̐ḍavu ne nĕṟam̐ganā
yīvala nāvala suddulĕlla nāgum̐ jĕppevu

(||nīvi||)
maṁtanāna nenu nīmanasĕllam̐ ganum̐gŏṁṭi
viṁtalai nīmāḍalĕlla velusugŏṁṭi
vaṁtulu vĕṭṭuga nīvalabĕllam̐ dĕlisidi
yĕṁtagĕṁta nīguṇamu yela māgum̐ jĕppevu

(||nīvi||)
kaḍala nīvidyalu ikkaḍane visāriṁchidi
baḍi nuṁḍi nīlāgu bhāviṁchidi
vuḍugaga nīdo navvi vorubu visāriṁchidi
yĕḍalega nīnerubu lela nāgum̐ jĕppevu

(||nīvi||)
ninnum̐ gām̐giḍane kūḍi nĕyyamĕllām̐ jegŏṁṭi
sannula nŏtti nīmovi savigŏṁṭini
yinniḍā śhrīveṁkaḍeśha ichchagamulu mĕchchidi
yĕnnaḍi kidi gurudu yela nāgum̐ jĕppevu