Nee vimkam dappimchugomte nemdu maanunaa

నీ విఁకఁ దప్పించుకొంటే నేఁడు మానునా
Language

(॥పల్లవి॥)
నీ విఁకఁ దప్పించుకొంటే నేఁడు మానునా
వేవేలై నా నీకు వేసరఁగ వచ్చునా

(॥॥)
హత్తి మా విన్నపము లవధరించఁ గ రాదా
చిత్తము వచ్చినటులఁ జేసేవు గాకా
బత్తి సేసి రిద్దరును పడఁతులు నీ మీఁద
యిత్తల నిన్ను దూరితే నేల లోఁగే విందుకూ

(॥॥)
తప్పక నీ విద్దరిని తగవు లడుగరాదా
అప్పటికి నన్ని పనులయ్యీఁ గాకా
యెప్పుడు నీకుఁ గానె యిద్దరూఁ దమకించేరు
తప్పించుక నీ వేల దాఁ గీ విందులకూ

(॥॥)
కందువ నీ విద్దరినిఁ గౌఁగిలింపించఁగ రాదా
అందపు రతులు నీకు నబ్బీఁ గాకా
పొందిరి శ్రీ వేంకటేశ పొత్తుల మగఁడ నిన్ను
సందడించే రంటా నేల జడిసే విందులకూ

(||pallavi||)
nī vim̐kam̐ dappiṁchugŏṁṭe nem̐ḍu mānunā
vevelai nā nīgu vesaram̐ga vachchunā

(||||)
hatti mā vinnabamu lavadhariṁcham̐ ga rādā
sittamu vachchinaḍulam̐ jesevu gāgā
batti sesi riddarunu paḍam̐tulu nī mīm̐da
yittala ninnu dūride nela lom̐ge viṁdugū

(||||)
tappaga nī viddarini tagavu laḍugarādā
appaḍigi nanni panulayyīm̐ gāgā
yĕppuḍu nīgum̐ gānĕ yiddarūm̐ damagiṁcheru
tappiṁchuga nī vela dām̐ gī viṁdulagū

(||||)
kaṁduva nī viddarinim̐ gaum̐giliṁpiṁcham̐ga rādā
aṁdabu radulu nīgu nabbīm̐ gāgā
pŏṁdiri śhrī veṁkaḍeśha pŏttula magam̐ḍa ninnu
saṁdaḍiṁche raṁṭā nela jaḍise viṁdulagū