నీ విందు విచ్చేయుదాఁకా నిలిచితిమి
(॥పల్లవి॥)
నీ విందు విచ్చేయుదాఁకా నిలిచితిమి
యే వివరమున రతి కెక్కేనో కాని
(॥నీవిం॥)
నిండిననామతిలోన నీరూపే తలపోసి
కొండవంటికోరికెలే కోరుచుందును
దండిసంతసములనే తగ దొబ్బితిఁ బొద్దులు
పండి యిటమీఁద నెట్టు బతికేనో కాని
(॥నీవిం॥)
కందువసుద్దులు కొన్ని కల్పించుకొని నీతో
అందాన నాలోనే మాటలాడుచుందును
అంది యీమనోరథాల నాఁపితి విరహ మెల్ల
కిందు మీఁదు నిఁక నెట్టు గెలిచేనో కాని
(॥నీవిం॥)
అట్టె యేకతమనేటిఅమృతలరిలోన
గట్టిగా నీకాఁగిట నేఁ గలశుంటిని
నెట్టన శ్రీ వేంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
మట్టుతో నెట్లు నిన్ను మరుపేనో కాని
(||pallavi||)
nī viṁdu vichcheyudām̐kā nilisidimi
ye vivaramuna radi kĕkkeno kāni
(||nīviṁ||)
niṁḍinanāmadilona nīrūbe talabosi
kŏṁḍavaṁṭigorigĕle korusuṁdunu
daṁḍisaṁtasamulane taga dŏbbidim̐ bŏddulu
paṁḍi yiḍamīm̐da nĕṭṭu badigeno kāni
(||nīviṁ||)
kaṁduvasuddulu kŏnni kalbiṁchugŏni nīdo
aṁdāna nālone māḍalāḍusuṁdunu
aṁdi yīmanorathāla nām̐pidi viraha mĕlla
kiṁdu mīm̐du nim̐ka nĕṭṭu gĕliseno kāni
(||nīviṁ||)
aṭṭĕ yegadamaneḍiamṛtalarilona
gaṭṭigā nīgām̐giḍa nem̐ galaśhuṁṭini
nĕṭṭana śhrī veṁkaḍeśha nem̐ḍu nannum̐ gūḍidivi
maṭṭudo nĕṭlu ninnu marubeno kāni