నీ విదె నే నదె నెమ్మదిఁ దానూ నదె
(॥పల్లవి॥)
నీ విదె నే నదె నెమ్మదిఁ దానూ నదె
ఆవలి మొగము లేల అద్దరిపాటాయను
(॥నీవిదె॥)
వచ్చినట్టిపరాకున వనిత నన్నుఁ గానక
యిచ్చ నీవద్ద గూచుండి యిటు చూచి
యెచ్చరి నీ పే రడిగీ నెరఁగనిదానె వలె
తచ్చన లిం కేల సమతారుకాణ లాయను
(॥నీవిదె॥)
యీడ నాగురు తెరఁగ కీపె వచ్చి వోయి నీతో
యేడలేనిముచ్చ టాడె యేకతానను
తోడ నీ వెచ్చరించఁగా తొయ్యలి యామాటలె
యేడో కతలు సేసీ నిఁక నేల బొంకులు
(॥నీవిదె॥)
పరపుపై నిద్దరము పవళించు టెరఁగక
యిరవుగఁ గాఁగిలించె నిద్దరి నీపె
గరిమ శ్రీవెంకటేశ కలసితి విట్టె మమ్ము
దరి చేరెఁ బను లెల్ల తన కేల సిగ్గులూ
(||pallavi||)
nī vidĕ ne nadĕ nĕmmadim̐ dānū nadĕ
āvali mŏgamu lela addaribāḍāyanu
(||nīvidĕ||)
vachchinaṭṭibarāguna vanida nannum̐ gānaga
yichcha nīvadda gūsuṁḍi yiḍu sūsi
yĕchchari nī pe raḍigī nĕram̐ganidānĕ valĕ
tachchana liṁ kela samadārugāṇa lāyanu
(||nīvidĕ||)
yīḍa nāguru tĕram̐ga kībĕ vachchi voyi nīdo
yeḍalenimuchcha ṭāḍĕ yegadānanu
toḍa nī vĕchchariṁcham̐gā tŏyyali yāmāḍalĕ
yeḍo kadalu sesī nim̐ka nela bŏṁkulu
(||nīvidĕ||)
parabubai niddaramu pavaḽiṁchu ṭĕram̐gaga
yiravugam̐ gām̐giliṁchĕ niddari nībĕ
garima śhrīvĕṁkaḍeśha kalasidi viṭṭĕ mammu
dari serĕm̐ banu lĕlla tana kela siggulū