నీ విచ్చిన బాసలు నిలిపి మన్నించవయ్య
(॥పల్లవి॥)
నీ విచ్చిన బాసలు నిలిపి మన్నించవయ్య
కైవసమైనవారిఁ గరుణించరాదా
(॥నీవి॥)
వేసాల మాటలను వేగినంతాఁ గత చెప్పి
ఆసలఁ బెట్టితివట అవునయ్యా
బేసబెల్లితనమునఁ బిలిపించి యిందరిలో
సేసవెట్టి పచ్చిసేసి సిగ్గులువరతురా
(॥నీవి॥)
కూరిమి నవ్వులు నవ్వి కొత్తయిన చేఁతలు చేసి
ఆరితేరి జంకింతురా అవునయ్యా
గారవించి పైఁ జేయిడి కరఁగించి కొలువులో
జీరదీసి చొక్కించి సిగ్గులువరతురా
(॥నీవి॥)
చాయల సన్నలు చూపి సరసములే యాడి
ఆయితములే సేసితి వవునయ్యా
చేయిచ్చి కాఁగిటఁ గూడి శ్రీవేంకటేశ యింటిలో
సేయరానిసేవ గొని సిగ్గులువరతురా
(||pallavi||)
nī vichchina bāsalu nilibi manniṁchavayya
kaivasamainavārim̐ garuṇiṁcharādā
(||nīvi||)
vesāla māḍalanu veginaṁtām̐ gada sĕppi
āsalam̐ bĕṭṭidivaḍa avunayyā
besabĕllidanamunam̐ bilibiṁchi yiṁdarilo
sesavĕṭṭi pachchisesi sigguluvaradurā
(||nīvi||)
kūrimi navvulu navvi kŏttayina sem̐talu sesi
ārideri jaṁkiṁturā avunayyā
gāraviṁchi paim̐ jeyiḍi karam̐giṁchi kŏluvulo
jīradīsi sŏkkiṁchi sigguluvaradurā
(||nīvi||)
sāyala sannalu sūbi sarasamule yāḍi
āyidamule sesidi vavunayyā
seyichchi kām̐giḍam̐ gūḍi śhrīveṁkaḍeśha yiṁṭilo
seyarāniseva gŏni sigguluvaradurā