నీ విభుఁడు నిన్నుఁ జూచి నివ్వెరగుతో నున్నాఁడు
(॥పల్లవి॥)
నీ విభుఁడు నిన్నుఁ జూచి నివ్వెరగుతో నున్నాఁడు
వేవేగఁ గాఁగిలించవే మోహనాంగి
(॥నీవి॥)
తియ్యనిమాటలతోను తేనెలేల చిందేనే
చయ్యటపు సణఁగుల చక్కెరబొమ్మ
నెయ్యపు చన్నుల పైఁడి నిగ్గులేల దులిపేవే
వుయ్యాల మంచము మీఁద నో మెరుఁగుఁబోఁడి
(॥నీవి॥)
పువ్వుల తురుములోను పుప్పొడి యేల రాల్చేవే
నవ్వుల మొల్లల మోహనపు లతిక
జవ్వనపు మదమున జాజర లేలాడేవే
రవ్వలైన వసంతపు రాజీవనేత్రి
(॥నీవి॥)
వడిగా నిట్టూర్పుల వాసన లెంత నించేవే
కడుఁ జల్లఁదనమున కప్పురగంది
అడరి శ్రీవేంకటేశుఁ డాతఁడే నిన్నేలినాఁడు
కడఁగి యేలలసేవే కరికుంభ జఘన
(||pallavi||)
nī vibhum̐ḍu ninnum̐ jūsi nivvĕragudo nunnām̐ḍu
vevegam̐ gām̐giliṁchave mohanāṁgi
(||nīvi||)
tiyyanimāḍaladonu tenĕlela siṁdene
sayyaḍabu saṇam̐gula sakkĕrabŏmma
nĕyyabu sannula paim̐ḍi niggulela dulibeve
vuyyāla maṁchamu mīm̐da no mĕrum̐gum̐bom̐ḍi
(||nīvi||)
puvvula turumulonu puppŏḍi yela rālseve
navvula mŏllala mohanabu ladiga
javvanabu madamuna jājara lelāḍeve
ravvalaina vasaṁtabu rājīvanetri
(||nīvi||)
vaḍigā niṭṭūrbula vāsana lĕṁta niṁcheve
kaḍum̐ jallam̐danamuna kappuragaṁdi
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe ninnelinām̐ḍu
kaḍam̐gi yelalaseve kariguṁbha jaghana