Nee vibhumdu gelisesee ninnum joosi

నీ విభుఁడు గేలిసేసీ నిన్నుఁ జూచి
Language

(॥పల్లవి॥)
నీ విభుఁడు గేలిసేసీ నిన్నుఁ జూచి
యీవలఁ దాలిమి లేదు యింతలోనిదానవా

(॥నీవి॥)
శిరసు వంచనేఁటికే సిగ్గుపడనేఁటికే
గరిమ నీపతిఁగంటే కళదాఁకెనా
చెరలాట లేఁటికే చెమరించనేఁటికే
సరసములాడితేనే కరఁగితివా

(॥నీవి॥)
పులకించనేఁటికే పొంచి నివ్వెరగేఁటికే
తలఁపులోనే కూటమి దక్కెనా నీకు
అలయఁగ నేఁటికే అసురుసురేఁటికే
సొలపుఁజూపులలోనె సోఁకెనా వలపులు

(॥నీవి॥)
గుట్టుసేయనేఁటికే కొప్పు వీడనేఁటికే
అట్టె చేయిచాఁచితేనే ఆయనాపొందు
నెట్టన శ్రీవేంకటాద్రినిలయుఁడు నిన్నుఁగూడె
ముట్టినపానుపుపైనే ముంచెనాకోరికలు

(||pallavi||)
nī vibhum̐ḍu gelisesī ninnum̐ jūsi
yīvalam̐ dālimi ledu yiṁtalonidānavā

(||nīvi||)
śhirasu vaṁchanem̐ṭige siggubaḍanem̐ṭige
garima nībadim̐gaṁṭe kaḽadām̐kĕnā
sĕralāḍa lem̐ṭige sĕmariṁchanem̐ṭige
sarasamulāḍidene karam̐gidivā

(||nīvi||)
pulagiṁchanem̐ṭige pŏṁchi nivvĕragem̐ṭige
talam̐pulone kūḍami dakkĕnā nīgu
alayam̐ga nem̐ṭige asurusurem̐ṭige
sŏlabum̐jūbulalonĕ som̐kĕnā valabulu

(||nīvi||)
guṭṭuseyanem̐ṭige kŏppu vīḍanem̐ṭige
aṭṭĕ seyisām̐sidene āyanābŏṁdu
nĕṭṭana śhrīveṁkaḍādrinilayum̐ḍu ninnum̐gūḍĕ
muṭṭinabānububaine muṁchĕnāgorigalu