Nee vettu sesinaa nee keeride

నీ వెట్టు సేసినా నీ కీరితే
Language

(॥పల్లవి॥)
నీ వెట్టు సేసినా నీ కీరితే
భావించి నీవల్లనే బ్రదుకుట గాకా

(॥॥)
నికు మోహించిన వారు నిన్ను మరి దూరుదురా
కైకొను మనేవారు కాంతాళింతురా
వాకుచ్చి పొగడేవారు వడి వెంగేలాడుదురా
పైకొని నీ చిత్తము రా బదుకుట గాకా

(॥॥)
నీతోడ నవ్వేవారు నిన్ను నటు జంకింతురా
చేతు లెత్తి మొక్కేవారు జేర దీతురా
ఆతుమఁ దలఁచేవారు అలుకలు చూపుదురా
పై తరవు బత్తి సేసి బదుకుట గాకా

(॥॥)
తగఁ బెండ్లాడిన వారు తప్పులు వట్టుదురా
మొగిఁ భాయలేనివారు మోము వంతురా
నిగిడి శ్రీ వేంకటేశ నే నలమేలుమంగను
బగివాయ కేలితివి బదుకుట గాకా

(||pallavi||)
nī vĕṭṭu sesinā nī kīride
bhāviṁchi nīvallane braduguḍa gāgā

(||||)
nigu mohiṁchina vāru ninnu mari dūrudurā
kaigŏnu manevāru kāṁtāḽiṁturā
vāguchchi pŏgaḍevāru vaḍi vĕṁgelāḍudurā
paigŏni nī sittamu rā baduguḍa gāgā

(||||)
nīdoḍa navvevāru ninnu naḍu jaṁkiṁturā
sedu lĕtti mŏkkevāru jera dīdurā
ādumam̐ dalam̐sevāru alugalu sūbudurā
pai taravu batti sesi baduguḍa gāgā

(||||)
tagam̐ bĕṁḍlāḍina vāru tappulu vaṭṭudurā
mŏgim̐ bhāyalenivāru momu vaṁturā
nigiḍi śhrī veṁkaḍeśha ne nalamelumaṁganu
bagivāya kelidivi baduguḍa gāgā