నీ వెరుఁగుదు విది నెలఁతకడకు నిటు
(॥పల్లవి॥)
నీ వెరుఁగుదు విది నెలఁతకడకు నిటు
వేవేగఁ దెలుపుదు విచ్చేయవయ్యా
(॥నీవె॥)
వూచినవెన్నెల పన్నమ కప్పురఁ
మేచి సతికిఁ బగ లేలాయా
వాచవి శేషునివాతివిందు తరి
వేచి యీపెకును వెగటా(టే?) లాయా
(॥నీవె॥)
దిమ్మువసంతపు తేనెలపుట్టలు
యిమ్మగువకు దిగు లేలాయా
కమ్మనివాసనగాలి వాడికెలు
కమ్మి యీ పెమతి కస టేలాలాయా
(॥నీవె॥)
ఆకుగొరుకులగు యంగజుమర్మము
యీకడఁ జెలి కెర వేలాయా
కైకొని శ్రీవేంకటేశ కూడితిఁ
వీకెకుఁ జుట్టము లిన్నియు నాయా
(||pallavi||)
nī vĕrum̐gudu vidi nĕlam̐tagaḍagu niḍu
vevegam̐ dĕlubudu vichcheyavayyā
(||nīvĕ||)
vūsinavĕnnĕla pannama kappuram̐
mesi sadigim̐ baga lelāyā
vāsavi śheṣhunivādiviṁdu tari
vesi yībĕgunu vĕgaḍā(ṭe?) lāyā
(||nīvĕ||)
dimmuvasaṁtabu tenĕlabuṭṭalu
yimmaguvagu digu lelāyā
kammanivāsanagāli vāḍigĕlu
kammi yī pĕmadi kasa ṭelālāyā
(||nīvĕ||)
āgugŏrugulagu yaṁgajumarmamu
yīgaḍam̐ jĕli kĕra velāyā
kaigŏni śhrīveṁkaḍeśha kūḍidim̐
vīgĕgum̐ juṭṭamu linniyu nāyā