నీ వెఱుఁగవా వోయి నెఱజాణ విన్నిటాను
(॥పల్లవి॥)
నీ వెఱుఁగవా వోయి నెఱజాణ విన్నిటాను
చేవ దేర నిందుకే నే సిగ్గుతో నున్నదానను
(॥నీమోఱుఁగ॥)
మగఁ డేమి సేసినాను మగువల కియ్యకోలే
వొగి సవతుల చేఁత కోరువరాదు
నగినవారితో మారు నగఁ బాడి యెవ్వరికి
జగడించేవారితోడ చవి గాదు గాని
(॥నీమోఱుఁగ॥)
కాముఁడెటు సేసినాను కాముకులనుఁ బోదు
ఆసని కోయిలలచే నలయరాదు
దోమటిదొడుకువారితోఁ బొత్తు గలయఁ జెల్లు
యేమిటా లాఁతివారితో నీడు గాదు గాని
(॥నీమోఱుఁగ॥)
శ్రీవేంకటేశుఁడ నీతో చెంది నేఁ బెండ్లాడఁగా
వేవేలు కాఁకల కెల్లా వేసరరాదు
వావాత మాటాడేటివారితో మాటాడవచ్చు
తోవరానివారితో సుద్దులు గావు గాని
(||pallavi||)
nī vĕṟum̐gavā voyi nĕṟajāṇa vinniḍānu
seva dera niṁduge ne siggudo nunnadānanu
(||nīmoṟum̐ga||)
magam̐ ḍemi sesinānu maguvala kiyyagole
vŏgi savadula sem̐ta koruvarādu
naginavārido māru nagam̐ bāḍi yĕvvarigi
jagaḍiṁchevāridoḍa savi gādu gāni
(||nīmoṟum̐ga||)
kāmum̐ḍĕḍu sesinānu kāmugulanum̐ bodu
āsani koyilalase nalayarādu
domaḍidŏḍuguvāridom̐ bŏttu galayam̐ jĕllu
yemiḍā lām̐tivārido nīḍu gādu gāni
(||nīmoṟum̐ga||)
śhrīveṁkaḍeśhum̐ḍa nīdo sĕṁdi nem̐ bĕṁḍlāḍam̐gā
vevelu kām̐kala kĕllā vesararādu
vāvāda māḍāḍeḍivārido māḍāḍavachchu
tovarānivārido suddulu gāvu gāni