Nee veramgavade vo nelamta yee tagavulu

నీ వెరఁగవటె వో నెలఁత యీ తగవులు
Language

(॥పల్లవి॥)
నీ వెరఁగవటె వో నెలఁత యీ తగవులు
కైవస మయ్యె యాతనిఁ గరఁగించవలెను

(॥నీవె॥)
పంతములాడఁ దగదు పడఁతికిఁ బతితోను
చెంతనుండి వూడిగమె సేయుట గాని
చింతించ వలదు యేమిసేసినా నాతనివద్ద
సంతోసానఁ జెనకితే సమ్మతించవలెను

(॥నీవె॥)
వేసరుకొనవలదు విభు డెలయించితేను
ఆసరేఁచి యిచ్చకము లాడుట గాని
వాసులు చూపఁగరాదు వనిత నీడువెట్టితే
చేసూటికెల్లా వచ్చి చెలఁగించవలెను

(॥నీవె॥)
సిగ్గున జంకించవద్దు శ్రీవేంకటేశుఁ డేలెను
అగ్గలపురతి నోలలార్చుట గాని
యెగ్గులు వట్టకు మరి యెన్నఁడూ నితనితోను
వెగ్గళపువేడుకల వెలయఁగవలెను

(||pallavi||)
nī vĕram̐gavaḍĕ vo nĕlam̐ta yī tagavulu
kaivasa mayyĕ yādanim̐ garam̐giṁchavalĕnu

(||nīvĕ||)
paṁtamulāḍam̐ dagadu paḍam̐tigim̐ badidonu
sĕṁtanuṁḍi vūḍigamĕ seyuḍa gāni
siṁtiṁcha valadu yemisesinā nādanivadda
saṁtosānam̐ jĕnagide sammadiṁchavalĕnu

(||nīvĕ||)
vesarugŏnavaladu vibhu ḍĕlayiṁchidenu
āsarem̐si yichchagamu lāḍuḍa gāni
vāsulu sūbam̐garādu vanida nīḍuvĕṭṭide
sesūḍigĕllā vachchi sĕlam̐giṁchavalĕnu

(||nīvĕ||)
sigguna jaṁkiṁchavaddu śhrīveṁkaḍeśhum̐ ḍelĕnu
aggalaburadi nolalārsuḍa gāni
yĕggulu vaṭṭagu mari yĕnnam̐ḍū nidanidonu
vĕggaḽabuveḍugala vĕlayam̐gavalĕnu