నీ వెఱఁగవా యింత నిండుదొరవు
(॥పల్లవి॥)
నీ వెఱఁగవా యింత నిండుదొరవు
చేవలే చిగురులౌను సిగ్గుననుంటేను
(॥॥)
అంటి విడె మిచ్చేవు అందుకొనకుండరాదు
వెంటనే పెండ్లికో వీడుకోలుకో
వొంటి నున్నదాన నేను వొకరు సాకిరి లేరు
ఇంటివా రేమందురో నే నియ్యకొంటేఁగనక
(॥॥)
చెక్కు గోర నదిమేవు చేయివట్టి తోయరాదు
పక్కనఁ గూరిమికో పగసేసేవో
చిక్కితి నీపాల నేను చెప్పిచూప నెడలేదు
వొక్కట గురుతుపడి వూరకుండితేను
(॥॥)
కాఁగిలించవచ్చేవు కాదని తొలఁగరాదు
ఆఁగినజెట్టిసామో అంగరతియో
మూఁగుచు శ్రీవేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
కాఁగి ఇఁకనేమన్నా కైతప్పులౌను
(||pallavi||)
nī vĕṟam̐gavā yiṁta niṁḍudŏravu
sevale sigurulaunu siggunanuṁṭenu
(||||)
aṁṭi viḍĕ michchevu aṁdugŏnaguṁḍarādu
vĕṁṭane pĕṁḍligo vīḍugolugo
vŏṁṭi nunnadāna nenu vŏgaru sāgiri leru
iṁṭivā remaṁduro ne niyyagŏṁṭem̐ganaga
(||||)
sĕkku gora nadimevu seyivaṭṭi toyarādu
pakkanam̐ gūrimigo pagasesevo
sikkidi nībāla nenu sĕppisūba nĕḍaledu
vŏkkaḍa gurudubaḍi vūraguṁḍidenu
(||||)
kām̐giliṁchavachchevu kādani tŏlam̐garādu
ām̐ginajĕṭṭisāmo aṁgaradiyo
mūm̐gusu śhrīveṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi
kām̐gi im̐kanemannā kaidappulaunu