నీ వెఱఁగవా వోయి నే నేమిచెప్పే నీకు
(॥పల్లవి॥)
నీ వెఱఁగవా వోయి నే నేమిచెప్పే నీకు
వేవేలైనాఁ బొందు సేసి విడువరాదు
(॥నీవె॥)
పంతములాడఁగవచ్చు పట్టెపెనఁగఁగవచ్చు
బంతినే సతులఁగూడి పాయఁగరాదు
రంతులు సేయఁగవచ్చు రాజసాన నుండవచ్చు
యెంతైనా వలపులేరు యీఁదఁగరాదు
(॥నీవె॥)
యెమ్మెలు నెరపవచ్చు యేమైనాఁ జేయఁగవచ్చు
దొమ్ముల నానవెట్టితే తోయఁగరాదు
వుమ్మడి నుండఁగవచ్చు వొరట్లు చూపవచ్చు
కమ్మి కాఁగిలించొకొంటే కాదనఁగరాదు
(॥నీవె॥)
నాయము చెప్పఁగవచ్చు నవ్వులు నవ్వఁగవచ్చు
పాయపుమదము చేతఁ బట్టఁగరాదు
యీయెడ శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
చాయలు చూపఁగవచ్చు జంట వాయరాదు
(||pallavi||)
nī vĕṟam̐gavā voyi ne nemisĕppe nīgu
vevelainām̐ bŏṁdu sesi viḍuvarādu
(||nīvĕ||)
paṁtamulāḍam̐gavachchu paṭṭĕbĕnam̐gam̐gavachchu
baṁtine sadulam̐gūḍi pāyam̐garādu
raṁtulu seyam̐gavachchu rājasāna nuṁḍavachchu
yĕṁtainā valabuleru yīm̐dam̐garādu
(||nīvĕ||)
yĕmmĕlu nĕrabavachchu yemainām̐ jeyam̐gavachchu
dŏmmula nānavĕṭṭide toyam̐garādu
vummaḍi nuṁḍam̐gavachchu vŏraṭlu sūbavachchu
kammi kām̐giliṁchŏgŏṁṭe kādanam̐garādu
(||nīvĕ||)
nāyamu sĕppam̐gavachchu navvulu navvam̐gavachchu
pāyabumadamu sedam̐ baṭṭam̐garādu
yīyĕḍa śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
sāyalu sūbam̐gavachchu jaṁṭa vāyarādu