Nee veṟamgavaa tagavu nerajaanavu

నీ వెఱఁగవా తగవు నెరజాణవు
Language

(॥పల్లవి॥)
నీ వెఱఁగవా తగవు నెరజాణవు
వోవల నెగ్గుపట్టక వోరుచుకోవయ్యా

(॥నీ వెఱఁగ॥)
చుట్టుకొన్న వలపులు సూటికి రాకుండితేను
తిట్టుదురు మగవానిఁ దెరవలు
గుట్టుతోడఁ దమకము గుబ్బతిలుకొంటాను
వొట్టులు వెట్టి సారెకు నుప్పతింతురు

(॥నీ వెఱఁగ॥)
వేడుకతోడఁ గాఁగిలివేళ కొదగకుండితే
యేడనైనా సొలతురు యింతులు
తోఁడ దోడ నాసలు దొమ్మిఁ జిమ్మిరేఁచితేను
జాడతోఁ జేతులు చాఁచి సాదింతురు

(॥నీ వెఱఁగ॥)
తలఁచిన తలఁపులు తారుకాణ రాకుండితే
బలిమిఁ బెనఁగుదురు పడఁతులు
యెలమి శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
లలనలు యిటులైతే లాలింతురు

(||pallavi||)
nī vĕṟam̐gavā tagavu nĕrajāṇavu
vovala nĕggubaṭṭaga vorusugovayyā

(||nī vĕṟam̐ga||)
suṭṭugŏnna valabulu sūḍigi rāguṁḍidenu
tiṭṭuduru magavānim̐ dĕravalu
guṭṭudoḍam̐ damagamu gubbadilugŏṁṭānu
vŏṭṭulu vĕṭṭi sārĕgu nuppadiṁturu

(||nī vĕṟam̐ga||)
veḍugadoḍam̐ gām̐giliveḽa kŏdagaguṁḍide
yeḍanainā sŏladuru yiṁtulu
tom̐ḍa doḍa nāsalu dŏmmim̐ jimmirem̐sidenu
jāḍadom̐ jedulu sām̐si sādiṁturu

(||nī vĕṟam̐ga||)
talam̐sina talam̐pulu tārugāṇa rāguṁḍide
balimim̐ bĕnam̐guduru paḍam̐tulu
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
lalanalu yiḍulaide lāliṁturu