Nee veṟamgavaa tagavu neṟajaana vinnidaanu

నీ వెఱఁగవా తగవు నెఱజాణ విన్నిటాను
Language

(॥పల్లవి॥)
నీ వెఱఁగవా తగవు నెఱజాణ విన్నిటాను
కోవిదుఁ డాతఁడు నిన్నెగ్గులు పట్టకున్నాను

(॥నీవె॥)
వెక్కసాన నీవతని వెంగెములాడినందుకు
చెక్కునొక్కి వేఁడుకొనఁజెల్లునే నీకు
గక్కనఁ బెనఁగఁగాను కాలుదాంకినందుకు
చక్కసాగిలి మొక్క సంగతీనౌనె

(॥నీవె॥)
జడికొన్నకాఁతాళాన జంకించినందుకు
వొడివట్టి పిలువఁగా నుచితమౌనె
కడుఁగరకుచూపులఁ గసరి చూచినందుకు
విడెమిచ్చి బుజ్జగించ వివరమూ నౌనె

(॥నీవె॥)
కులికికులికి నీవు గుబ్బలనొత్తినందుకు
అలపుదీర మోవియ్యనందమౌనె
తెలిపి శ్రీవేంకటేశు దేవులవయినందుకు
వలసినరీతుల నవ్వఁగ వావీనౌనె

(||pallavi||)
nī vĕṟam̐gavā tagavu nĕṟajāṇa vinniḍānu
kovidum̐ ḍādam̐ḍu ninnĕggulu paṭṭagunnānu

(||nīvĕ||)
vĕkkasāna nīvadani vĕṁgĕmulāḍinaṁdugu
sĕkkunŏkki vem̐ḍugŏnam̐jĕllune nīgu
gakkanam̐ bĕnam̐gam̐gānu kāludāṁkinaṁdugu
sakkasāgili mŏkka saṁgadīnaunĕ

(||nīvĕ||)
jaḍigŏnnagām̐tāḽāna jaṁkiṁchinaṁdugu
vŏḍivaṭṭi piluvam̐gā nusidamaunĕ
kaḍum̐garagusūbulam̐ gasari sūsinaṁdugu
viḍĕmichchi bujjagiṁcha vivaramū naunĕ

(||nīvĕ||)
kuligiguligi nīvu gubbalanŏttinaṁdugu
alabudīra moviyyanaṁdamaunĕ
tĕlibi śhrīveṁkaḍeśhu devulavayinaṁdugu
valasinarīdula navvam̐ga vāvīnaunĕ