నీ వెఱఁగవా తగవు నేము చెప్ప నేమున్నది
(॥పల్లవి॥)
నీ వెఱఁగవా తగవు నేము చెప్ప నేమున్నది
మావంటి చెలులను మన్నించుటగాక
(॥నీవె॥)
చేయి వట్టితే పతితో సిగ్గులు వడుదురా
ఆయ మెరిఁగి సరసమాడఁ గదవే
నీయందు బత్తిసేసితే నివ్వెరగందుదురా
చాయలా సన్నలా పొందు జరపుటగాక
(॥నీవె॥)
తప్పక చూచితేను తలవంచుకొందురా
చెప్పినట్టెల్లా నీవు సేయఁగదవే
కొప్పు దువ్వి పెనఁగితే కొంచించి లోఁగుదురా
ముప్పిరి నియ్యకొని ముంచి నగుటగాక
(॥నీవె॥)
కూరిమిఁ గాఁగిలించితే గుట్టుసేసుకొందురా
సారె సారె వలపులు చల్లఁగదవే
కోరి శ్రీవేంకటేశుఁడు కూడఁగా నెలయింతురా
చేరి సేవలెల్లా నిట్టే సేయుటగాక
(||pallavi||)
nī vĕṟam̐gavā tagavu nemu sĕppa nemunnadi
māvaṁṭi sĕlulanu manniṁchuḍagāga
(||nīvĕ||)
seyi vaṭṭide padido siggulu vaḍudurā
āya mĕrim̐gi sarasamāḍam̐ gadave
nīyaṁdu battiseside nivvĕragaṁdudurā
sāyalā sannalā pŏṁdu jarabuḍagāga
(||nīvĕ||)
tappaga sūsidenu talavaṁchugŏṁdurā
sĕppinaṭṭĕllā nīvu seyam̐gadave
kŏppu duvvi pĕnam̐gide kŏṁchiṁchi lom̐gudurā
muppiri niyyagŏni muṁchi naguḍagāga
(||nīvĕ||)
kūrimim̐ gām̐giliṁchide guṭṭusesugŏṁdurā
sārĕ sārĕ valabulu sallam̐gadave
kori śhrīveṁkaḍeśhum̐ḍu kūḍam̐gā nĕlayiṁturā
seri sevalĕllā niṭṭe seyuḍagāga