Nee veramgavaa tagavu neegu vinnavimchemaa

నీ వెరఁగవా తగవు నీకు విన్నవించేమా
Language

(॥పల్లవి॥)
నీ వెరఁగవా తగవు నీకు విన్నవించేమా
వేవేలు సతులలోన వెలయించ రాదా

(॥నీ వెరగ॥)
నలుదిక్కులుఁ జూచేవు నాదిక్కు చూడఁగ రాదా
వలపు నీ పై జల్లెటివనిత నేను
పిలిచినవాఁడవు ప్రేమ చూపక మానవు
తొలుతె కాఁగిట నించి దొద్ద సేయ రాదా

(॥నీ వెరగ॥)
కానుక లందేవాఁడవు గక్కన నన్నంట రాదా
పానికుచముల నిమ్మపండ్లదానను
పూని నవ్వినవాఁడవు భోగించక మానవు
నే నడిగినవేళనె నీవు లోఁగ రాదా

(॥నీ వెరగ॥)
కడు నా సోదకాడఁవు కాఁగిలించుకో రాదా
ఆడియాల మైన నీ యాఁటదానమ
యెడయక శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
కడమ లేకుండ నిట్టె గతి గూడ రాదా

(||pallavi||)
nī vĕram̐gavā tagavu nīgu vinnaviṁchemā
vevelu sadulalona vĕlayiṁcha rādā

(||nī vĕraga||)
naludikkulum̐ jūsevu nādikku sūḍam̐ga rādā
valabu nī pai jallĕḍivanida nenu
pilisinavām̐ḍavu prema sūbaga mānavu
tŏludĕ kām̐giḍa niṁchi dŏdda seya rādā

(||nī vĕraga||)
kānuga laṁdevām̐ḍavu gakkana nannaṁṭa rādā
pānigusamula nimmabaṁḍladānanu
pūni navvinavām̐ḍavu bhogiṁchaga mānavu
ne naḍiginaveḽanĕ nīvu lom̐ga rādā

(||nī vĕraga||)
kaḍu nā sodagāḍam̐vu kām̐giliṁchugo rādā
āḍiyāla maina nī yām̐ṭadānama
yĕḍayaga śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
kaḍama leguṁḍa niṭṭĕ gadi gūḍa rādā