Nee veṟamgavaa imta nerajaanavu

నీ వెఱఁగవా ఇంత నెరజాణవు
Language

(॥పల్లవి॥)
నీ వెఱఁగవా ఇంత నెరజాణవు
భావించి నవ్వంగానే పంతములాడుదురా

(॥నీవె॥)
చిత్తగించవమ్మా చెలి; నీవు చూచుదాఁకా
తత్తరించీ రమణుఁడు; తలవంతురా
కొత్లలేఁటికమ్మా కొలువులోపల; నీపై
బత్తితోడఁ బిలువఁగఁ బలుకకుందురా

(॥నీవె॥)
అందుకొనవమ్మా ఆతఁడు వీడెము చేత
నందియ్యఁగాఁ జేకొనక అట్టె వుందురా
మందట లేలమ్మా మనసిచ్చి తనమోవి
నిందు నీకుఁ బెట్టఁగాను వీఁగుచునుండుదురా

(॥నీవె॥)
మెచ్చు మెచ్చవమ్మా మేకొని శ్రీవేంకటేశుఁ
డచ్చముగా నిన్నుఁ గూడె నలఇంతురా
తచ్చనేఁటికమ్మా తగినరతుల నీతో
మచ్చికలాడఁగాను మరపింతురా

(||pallavi||)
nī vĕṟam̐gavā iṁta nĕrajāṇavu
bhāviṁchi navvaṁgāne paṁtamulāḍudurā

(||nīvĕ||)
sittagiṁchavammā sĕli; nīvu sūsudām̐kā
tattariṁchī ramaṇum̐ḍu; talavaṁturā
kŏtlalem̐ṭigammā kŏluvulobala; nībai
battidoḍam̐ biluvam̐gam̐ balugaguṁdurā

(||nīvĕ||)
aṁdugŏnavammā ādam̐ḍu vīḍĕmu seda
naṁdiyyam̐gām̐ jegŏnaga aṭṭĕ vuṁdurā
maṁdaḍa lelammā manasichchi tanamovi
niṁdu nīgum̐ bĕṭṭam̐gānu vīm̐gusunuṁḍudurā

(||nīvĕ||)
mĕchchu mĕchchavammā megŏni śhrīveṁkaḍeśhum̐
ḍachchamugā ninnum̐ gūḍĕ nala̮iṁturā
tachchanem̐ṭigammā taginaradula nīdo
machchigalāḍam̐gānu marabiṁturā