Nee veṟamgavaa idi nerajaanavu

నీ వెఱఁగవా ఇది నెరజాణవు
Language

(॥పల్లవి॥)
నీ వెఱఁగవా ఇది నెరజాణవు
యీవల మాతో నీవే యెందాఁకాఁ జెప్పేవు

(॥నీవె॥)
పువ్వులఁ గొని వేసేది పుప్పొడి పైఁ జల్లేది
జవ్వనపుసతులకు సాజమే యది
నవ్వుసేసుకొంటేనే నానును వలపులెల్ల
చివ్వనఁ గోపించుకొంటే చేరుఁ గూళతనము

(॥నీవె॥)
మక్కువలు చూపేది మనసు సోదించేది
చక్కని కాంతలకును సాజమే యది
దక్కి లోనై వుండితేనే తతిగొనుఁ గూటములు
మిక్కిలి పెనఁగఁబోతే మించు నెడ్డతనము

(॥నీవె॥)
కరుణించి చూచేది కాఁగిలించి కూడేది
సరసపుటింతులకు సాజమే యది
నిరతి శ్రీవేంకటేశ నీకు నివే యింపులైను
వరుస నిటు గాకుంటే వచ్చు మంకుఁదనము

(||pallavi||)
nī vĕṟam̐gavā idi nĕrajāṇavu
yīvala mādo nīve yĕṁdām̐kām̐ jĕppevu

(||nīvĕ||)
puvvulam̐ gŏni vesedi puppŏḍi paim̐ jalledi
javvanabusadulagu sājame yadi
navvusesugŏṁṭene nānunu valabulĕlla
sivvanam̐ gobiṁchugŏṁṭe serum̐ gūḽadanamu

(||nīvĕ||)
makkuvalu sūbedi manasu sodiṁchedi
sakkani kāṁtalagunu sājame yadi
dakki lonai vuṁḍidene tadigŏnum̐ gūḍamulu
mikkili pĕnam̐gam̐bode miṁchu nĕḍḍadanamu

(||nīvĕ||)
karuṇiṁchi sūsedi kām̐giliṁchi kūḍedi
sarasabuḍiṁtulagu sājame yadi
niradi śhrīveṁkaḍeśha nīgu nive yiṁpulainu
varusa niḍu gāguṁṭe vachchu maṁkum̐danamu