నీ వెరఁగవా ఇది నేము విన్నవించనేల
(॥పల్లవి॥)
నీ వెరఁగవా ఇది నేము విన్నవించనేల
వావులు గలసితేనే వశము గావలెను
(॥నీవెరఁగ॥)
పంతము లాడఁగనేల పడఁతులకు లోనైతే
పొంతనే ప్రియము చెప్పి పొసఁగవలె
వింతలు సేయఁగనేల వీడుదొళ్లాడితేను
యెంతైనా సరసముల నెనయఁగవలెను
(॥నీవెరఁగ॥)
సిగ్గులు వడఁగనేల సేసలు వెట్టినప్పుడే
బగ్గన నవ్వులు నవ్వి పైకొనవలె
యెగ్గులు పట్టఁగనేల హృదయాలు గలసితే
వెగ్గలవు సంతోసాన విఱ్ఱవీఁగవలెను
(॥నీవెరఁగ॥)
వెనకముందెంచనేల వేడుకతోఁ గూడితేను
చనవులు మెరసి పచారించవలెను
ఘనుఁడ శ్రీవేంకటేశ కలికి నేలితి విట్టె
ననుపు లైనపుడే మన్నన లెంచవలెను
(||pallavi||)
nī vĕram̐gavā idi nemu vinnaviṁchanela
vāvulu galasidene vaśhamu gāvalĕnu
(||nīvĕram̐ga||)
paṁtamu lāḍam̐ganela paḍam̐tulagu lonaide
pŏṁtane priyamu sĕppi pŏsam̐gavalĕ
viṁtalu seyam̐ganela vīḍudŏḽlāḍidenu
yĕṁtainā sarasamula nĕnayam̐gavalĕnu
(||nīvĕram̐ga||)
siggulu vaḍam̐ganela sesalu vĕṭṭinappuḍe
baggana navvulu navvi paigŏnavalĕ
yĕggulu paṭṭam̐ganela hṛdayālu galaside
vĕggalavu saṁtosāna viṭravīm̐gavalĕnu
(||nīvĕram̐ga||)
vĕnagamuṁdĕṁchanela veḍugadom̐ gūḍidenu
sanavulu mĕrasi pasāriṁchavalĕnu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kaligi nelidi viṭṭĕ
nanubu lainabuḍe mannana lĕṁchavalĕnu