నీ వెఱఁగనివున్నవా నేరుపరివి
(॥పల్లవి॥)
నీ వెఱఁగనివున్నవా నేరుపరివి
వావులే గుఱిసేసి వద్దనుండవయ్యా
(॥నీవె॥)
పొలసి యేమిటికైనా బొమ్మల జంకింతుము
చలపట్టి నిన్ను నట్టే సాదింతుము
యెలమిఁ బొందైనవారి కెగ్గులేవి తప్పులేవి
వలపులే గురిగావా తెలుసుకోవయ్యా
(॥నీవె॥)
వినగానె నిన్ను గడువెంగెము లాడుదము
ననుపున నిట్టే కడు నాఁటఁ జాతుము
చనువు గల వారికి సరి యేమి బేసేమి
మనసులే గురిగావా మన్నించవయ్యా
(॥నీవె ||)
కందువ నేకతమైతే కడుఁ దమకింతుము
అందపు రతుల చేత నలయింతుము
యిందునే శ్రీవేంకటేశ యేలితివి మమ్ము మోవి
విందులివే గురిగావా వినోదించవయ్యా
(||pallavi||)
nī vĕṟam̐ganivunnavā nerubarivi
vāvule guṟisesi vaddanuṁḍavayyā
(||nīvĕ||)
pŏlasi yemiḍigainā bŏmmala jaṁkiṁtumu
salabaṭṭi ninnu naṭṭe sādiṁtumu
yĕlamim̐ bŏṁdainavāri kĕggulevi tappulevi
valabule gurigāvā tĕlusugovayyā
(||nīvĕ||)
vinagānĕ ninnu gaḍuvĕṁgĕmu lāḍudamu
nanubuna niṭṭe kaḍu nām̐ṭam̐ jādumu
sanuvu gala vārigi sari yemi besemi
manasule gurigāvā manniṁchavayyā
(||nīvĕ ||)
kaṁduva negadamaide kaḍum̐ damagiṁtumu
aṁdabu radula seda nalayiṁtumu
yiṁdune śhrīveṁkaḍeśha yelidivi mammu movi
viṁdulive gurigāvā vinodiṁchavayyā