నీ వెఱఁగనివి లేవు నెరజాణవు
(॥పల్లవి॥)
నీ వెఱఁగనివి లేవు నెరజాణవు
భావించి మీ వలపులు పచారించవలెనా
(॥నీవె॥)
పడఁతిచూపులలోనే పదివేలు విన్నపాలు
అడియాలము లన్నియు నందే వున్నవి
అడుగనేఁటికి మమ్ము ఆపె నిట్టె కరుణించు
విడిముడిగా నిఁక విచ్చి చెప్పవలెనా
(॥నీవె॥)
లలననవ్వులలోనే లక్షలై నయిచ్చకాలు
కలవెల్లా నందులోనే కానిపించీని
తెలుపనేఁటికి నిన్నుఁ దెఱవను మన్నించు
వెలలేనిసిగ్గులెల్లా వెలియవేవలెనా
(॥నీవె॥)
కోమలికాఁగిటిలోనే కోటికోటివినయాలు
ఆముకొని యెంచిచూడ నందే వున్నవి
చేముంచి నేఁటి కాపెను శ్రీ వేంకటేశుఁడ యేలు
ప్రేమపురతులు నీతోఁ బేరుకుచ్చవలెనా
(||pallavi||)
nī vĕṟam̐ganivi levu nĕrajāṇavu
bhāviṁchi mī valabulu pasāriṁchavalĕnā
(||nīvĕ||)
paḍam̐tisūbulalone padivelu vinnabālu
aḍiyālamu lanniyu naṁde vunnavi
aḍuganem̐ṭigi mammu ābĕ niṭṭĕ karuṇiṁchu
viḍimuḍigā nim̐ka vichchi sĕppavalĕnā
(||nīvĕ||)
lalananavvulalone lakṣhalai nayichchagālu
kalavĕllā naṁdulone kānibiṁchīni
tĕlubanem̐ṭigi ninnum̐ dĕṟavanu manniṁchu
vĕlalenisiggulĕllā vĕliyavevalĕnā
(||nīvĕ||)
komaligām̐giḍilone koḍigoḍivinayālu
āmugŏni yĕṁchisūḍa naṁde vunnavi
semuṁchi nem̐ṭi kābĕnu śhrī veṁkaḍeśhum̐ḍa yelu
premaburadulu nīdom̐ beruguchchavalĕnā