నీ వెఱఁగనిది లేదు నెరజాణవు
(॥పల్లవి॥)
నీ వెఱఁగనిది లేదు నెరజాణవు
వేవేలకు నీకు నేము వినయపువారము
(॥నీవె॥)
చలపాది దొక్కొక్కతె చండితోడ నుండుఁ గాని
లలనలమనసులు లక్కవంటివి
పెలుచుఁదనాలదే బెడరా లాడుఁ గాని
చలువతేనెమాఁటలే సుతులెల్లా నాడేవి
(॥నీవె॥)
గామిడి దొక్కొక్కతె కనలించుకొనుఁ గాని
కామినులమోములు కళదేరేవే
బూమెలాఁడి యైనదే బొమ్మల జంకించుఁ గాని
ఆముకొన్ననవ్వులే యతివలు చల్లేవి
(॥నీవె॥)
కతకారి దొక్కొక్కతె గబ్బియై పెనఁగుఁ గాని
సతులరతులు సంసారఫలమే
యితవై శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
మితిలేనివేడుకలే మెలుతలు సేసేవి
(||pallavi||)
nī vĕṟam̐ganidi ledu nĕrajāṇavu
vevelagu nīgu nemu vinayabuvāramu
(||nīvĕ||)
salabādi dŏkkŏkkadĕ saṁḍidoḍa nuṁḍum̐ gāni
lalanalamanasulu lakkavaṁṭivi
pĕlusum̐danālade bĕḍarā lāḍum̐ gāni
saluvadenĕmām̐ṭale sudulĕllā nāḍevi
(||nīvĕ||)
gāmiḍi dŏkkŏkkadĕ kanaliṁchugŏnum̐ gāni
kāminulamomulu kaḽadereve
būmĕlām̐ḍi yainade bŏmmala jaṁkiṁchum̐ gāni
āmugŏnnanavvule yadivalu sallevi
(||nīvĕ||)
kadagāri dŏkkŏkkadĕ gabbiyai pĕnam̐gum̐ gāni
sadularadulu saṁsāraphalame
yidavai śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
midileniveḍugale mĕludalu sesevi