Nee veṟamgani dunnadaa nelamta laagu

నీ వెఱఁగని దున్నదా నెలఁత లాగు
Language

(॥పల్లవి॥)
నీ వెఱఁగని దున్నదా నెలఁత లాగు
చేవదేరి చెక్కుతోడి చింతలివే

(॥నీవె॥)
పైపై నతివ నీకు ప్రాణమంటా నాడేవు
ఆపె చిత్తమున నున్న దామాఁటే
ఆపొందులు సిగ్గువిడిచాడఁగఁ జాలదుగానీ
మాపురేపు నెదలోని మర్మమిదే

(॥నీవె॥)
అలివేణి పొందులే నీ కన్నిసంపద లనేవు
తలఁపులో నాపెకు యీతమకములే
చెలులు నవ్వేరని చెనకకున్నదిగానీ
కలలోనఁ గనియేటికాను పిదే

(॥నీవే॥)
పడఁతిరతులే నీకు బ్రదుకని యెంచేవు
కడఁగి యాపెకు నిది కలగుణమే
తడవి శ్రీ వేంకటేశ తానే నీవనుండెఁగానీ
బడిపాయక కూడితి పంతము నిదె

(||pallavi||)
nī vĕṟam̐gani dunnadā nĕlam̐ta lāgu
sevaderi sĕkkudoḍi siṁtalive

(||nīvĕ||)
paibai nadiva nīgu prāṇamaṁṭā nāḍevu
ābĕ sittamuna nunna dāmām̐ṭe
ābŏṁdulu sigguviḍisāḍam̐gam̐ jāladugānī
māburebu nĕdaloni marmamide

(||nīvĕ||)
aliveṇi pŏṁdule nī kannisaṁpada lanevu
talam̐pulo nābĕgu yīdamagamule
sĕlulu navverani sĕnagagunnadigānī
kalalonam̐ ganiyeḍigānu pide

(||nīve||)
paḍam̐tiradule nīgu bradugani yĕṁchevu
kaḍam̐gi yābĕgu nidi kalaguṇame
taḍavi śhrī veṁkaḍeśha tāne nīvanuṁḍĕm̐gānī
baḍibāyaga kūḍidi paṁtamu nidĕ