నీ వెంత సేసినాను నే విడువలే గాక
(॥పల్లవి॥)
నీ వెంత సేసినాను నే విడువలే గాక
పూవులోపలి పిందె పొసఁగి పండవునా
(॥నీవెంత॥)
చిగురు చేగవుఁ గాక చేగేల చిగురవురా
నిగిడి నే వలతుఁగాక నీ వేల వలతువురా
సగము మంచితనాన చవి చేసుకొందుఁ గాక
తగిలి నేయి దాగినను దప్పీ దేరీనా
(॥నీవెంత॥)
నీరు కొలఁది తమ్మి గాక నీరు తామెరకొల దవునా
యేరా నీకుఁ జిక్కితిఁ గాక యిటు నాకుఁజిక్కవురా
నీరువంకతుంగనై నీమనసు గయికొంటి
కూరవండి కస వేర కొలది నుండీనా
(॥నీవెంత॥)
నువ్వులలో నూనె గాక నూనెలో నువ్వు లేవి
రవ్వలనే నీవు గాక రతులు నీ కెంత లేదు
యివ్వల శ్రీవేంకటేశ యిచ్చట నన్నుఁ గూడితివి
నవ్విన మీఁదట నలుక నాటకము గాదా
(||pallavi||)
nī vĕṁta sesinānu ne viḍuvale gāga
pūvulobali piṁdĕ pŏsam̐gi paṁḍavunā
(||nīvĕṁta||)
siguru segavum̐ gāga segela siguravurā
nigiḍi ne valadum̐gāga nī vela valaduvurā
sagamu maṁchidanāna savi sesugŏṁdum̐ gāga
tagili neyi dāginanu dappī derīnā
(||nīvĕṁta||)
nīru kŏlam̐di tammi gāga nīru tāmĕragŏla davunā
yerā nīgum̐ jikkidim̐ gāga yiḍu nāgum̐jikkavurā
nīruvaṁkaduṁganai nīmanasu gayigŏṁṭi
kūravaṁḍi kasa vera kŏladi nuṁḍīnā
(||nīvĕṁta||)
nuvvulalo nūnĕ gāga nūnĕlo nuvvu levi
ravvalane nīvu gāga radulu nī kĕṁta ledu
yivvala śhrīveṁkaḍeśha yichchaḍa nannum̐ gūḍidivi
navvina mīm̐daḍa naluga nāḍagamu gādā