Nee vemta ne memta nee krpa yemchuda gaaga

నీ వెంత నే మెంత నీ కృప యెంచుట గాక
Language

(॥పల్లవి॥)
నీ వెంత నే మెంత నీ కృప యెంచుట గాక
భావింప స్వతంత్రుఁడవు పరమేశ్వరుఁడవు

(॥నీవెంత॥)
సాదించరానివాఁడవు సకలోపాయములను
సాదించరానివాఁడవు చొచ్చి వెదకి
సాదించరానివాఁడవు వాకుచ్చి యెవ్వరికిని
పాదుకొనఁ గొలిచితే భక్తసులభుఁడవు

(॥నీవెంత॥)
మించరానివాఁడవు మేటిసురలకు నైనా
యెంచరానివాఁడవు యిట్టట్టనుచు
వంచరాని వాఁడవువడిఁ బ్రతాపములను
పంచనుండి నుతించితే భక్తలసులభుఁడవు

(॥నీవెంత॥)
పట్టరానివాఁడవు బలిమి నేరుపులను
ముట్టరానివాఁడవు మొక్కలానను
నెట్టన శ్రీవేంకటేశ నీ వెదుట నున్నాఁడవు
బట్టబయలు మొక్కితే భక్తసులభుఁడవు

(||pallavi||)
nī vĕṁta ne mĕṁta nī kṛpa yĕṁchuḍa gāga
bhāviṁpa svadaṁtrum̐ḍavu parameśhvarum̐ḍavu

(||nīvĕṁta||)
sādiṁcharānivām̐ḍavu sagalobāyamulanu
sādiṁcharānivām̐ḍavu sŏchchi vĕdagi
sādiṁcharānivām̐ḍavu vāguchchi yĕvvarigini
pādugŏnam̐ gŏliside bhaktasulabhum̐ḍavu

(||nīvĕṁta||)
miṁcharānivām̐ḍavu meḍisuralagu nainā
yĕṁcharānivām̐ḍavu yiṭṭaṭṭanusu
vaṁcharāni vām̐ḍavuvaḍim̐ bradābamulanu
paṁchanuṁḍi nudiṁchide bhaktalasulabhum̐ḍavu

(||nīvĕṁta||)
paṭṭarānivām̐ḍavu balimi nerubulanu
muṭṭarānivām̐ḍavu mŏkkalānanu
nĕṭṭana śhrīveṁkaḍeśha nī vĕduḍa nunnām̐ḍavu
baṭṭabayalu mŏkkide bhaktasulabhum̐ḍavu