Nee vemi sesinaanu ninnu nera memcharaadu

నీ వేమి సేసినాను నిన్ను నేర మెంచరాదు
Language

(॥పల్లవి॥)
నీ వేమి సేసినాను నిన్ను నేర మెంచరాదు
మూవంక నా నిజానికే మొక్కేఁ జుమ్మీ

(॥॥)
కన్నుల నీమర్మములు కాఁడిపారఁజూచితి
వున్నతి నాతప్పు నీవే వోరుచుకొమ్మీ
వెన్నెల నవ్వులు నవ్వి వేఁడిసిగ్గు రేఁచితి
మున్నుమున్నే యిందుకు మొక్కితిఁజుమ్మీ

(॥॥)
మాటలనే నీ మనసు మా యింటికిఁ గొంటఁ బోతి
యేఁటికైనా నన్ను నెగ్గు లెంచకుమీ
వాఁటపువినయముల వలపు లీఁదించితి
మూఁటగా వేవేలకు మొక్కేఁజుమ్మీ

(॥॥)
కూడుతానే కాఁగిటిలో కొనగోరు సోఁకించితి
వేడుక నన్ను వెనకవేసుకొమ్మీ
యీడనే శ్రీ వేంకటేశ ఇన్నియు నేఁ జేసితి
మోడిసేసి ఇందుకేకా మొక్కేఁజుమ్మీ

(||pallavi||)
nī vemi sesinānu ninnu nera mĕṁcharādu
mūvaṁka nā nijānige mŏkkem̐ jummī

(||||)
kannula nīmarmamulu kām̐ḍibāram̐jūsidi
vunnadi nādappu nīve vorusugŏmmī
vĕnnĕla navvulu navvi vem̐ḍisiggu rem̐sidi
munnumunne yiṁdugu mŏkkidim̐jummī

(||||)
māḍalane nī manasu mā yiṁṭigim̐ gŏṁṭam̐ bodi
yem̐ṭigainā nannu nĕggu lĕṁchagumī
vām̐ṭabuvinayamula valabu līm̐diṁchidi
mūm̐ṭagā vevelagu mŏkkem̐jummī

(||||)
kūḍudāne kām̐giḍilo kŏnagoru som̐kiṁchidi
veḍuga nannu vĕnagavesugŏmmī
yīḍane śhrī veṁkaḍeśha inniyu nem̐ jesidi
moḍisesi iṁdugegā mŏkkem̐jummī