నీ వేమి సేసినాను నీకుఁ జెల్లును
(॥పల్లవి॥)
నీ వేమి సేసినాను నీకుఁ జెల్లును
వెూపులు గిరుపనేల వెూహించినదానికి
(॥॥)
చెలఁగి పతి ముట్టితే చేతికి లోనౌటగాక
చలపాదితమేల జవరాలికి
పిలిచి పేరుకొంటే బెరసి వూఁకొంటగాక
వలననిబిగువేల వలచినదానికి
(॥॥)
వొగ్గి విడెమిచ్చితేను వొడి నించుకొంటగాక
సిగ్గులు వడఁగనేల చిన్నదానికి
దిగ్గన సరసమాడితేఁ జెనకుట గాక
యెగ్గులుపట్టఁగనేల యిచ్చకపుదానికి
(॥॥)
చనుఁగవ లంటితేను సమ్మతించుకొంట గాక
పెనఁగులాడఁగనేల ప్రియురాలికి
యెనసితివి శ్రీ వేంకటేశ యింతలో నన్ను
తనిసితిఁ గొంకనేల తమకపుదానికి
(||pallavi||)
nī vemi sesinānu nīgum̐ jĕllunu
vĕూpulu girubanela vĕూhiṁchinadānigi
(||||)
sĕlam̐gi padi muṭṭide sedigi lonauḍagāga
salabādidamela javarāligi
pilisi perugŏṁṭe bĕrasi vūm̐kŏṁṭagāga
valananibiguvela valasinadānigi
(||||)
vŏggi viḍĕmichchidenu vŏḍi niṁchugŏṁṭagāga
siggulu vaḍam̐ganela sinnadānigi
diggana sarasamāḍidem̐ jĕnaguḍa gāga
yĕggulubaṭṭam̐ganela yichchagabudānigi
(||||)
sanum̐gava laṁṭidenu sammadiṁchugŏṁṭa gāga
pĕnam̐gulāḍam̐ganela priyurāligi
yĕnasidivi śhrī veṁkaḍeśha yiṁtalo nannu
tanisidim̐ gŏṁkanela tamagabudānigi