నీ వేమి సేతువు నీ వొళ్లి కల్లగాదు
(॥పల్లవి॥)
నీ వేమి సేతువు నీ వొళ్లి కల్లగాదు
వావులు మోవితేనె నవ్వఁగఁ జూతురు
(॥నీవే॥)
సేసవెట్టి లచ్చిమమ్మ చెంగటనే వుండఁగాను
ఆసపడే వెవ్వరికో అప్పటి నీవు
యీటులేని సిరులెల్లా నింటిలోనే వుండఁగాను
కాసు వీదిఁ బడియుంటే కైకొని యెత్తుదురు
(॥నీవే॥)
వింతగా భూసతి నీవీఁపుననే వుండఁగాను
చింతించే వెవ్వరినోయి సిగ్గువడక
దొంతిఁ బెట్టి రుచులెల్లా దొరకి తమకుండినా
చింతకాయ గనుఁగొంటే చేరి నోరూరుదురు
(॥నీవే॥)
సింగారపుఁ దొళశమ్మ శిరసుపై నుండఁగాను
ముంగిట నెవ్వరికోయి మోహించేవు
ఇంగితాన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
అంగడిబేరాల కొసరడుగక మానరు
(||pallavi||)
nī vemi seduvu nī vŏḽli kallagādu
vāvulu movidenĕ navvam̐gam̐ jūduru
(||nīve||)
sesavĕṭṭi lachchimamma sĕṁgaḍane vuṁḍam̐gānu
āsabaḍe vĕvvarigo appaḍi nīvu
yīḍuleni sirulĕllā niṁṭilone vuṁḍam̐gānu
kāsu vīdim̐ baḍiyuṁṭe kaigŏni yĕttuduru
(||nīve||)
viṁtagā bhūsadi nīvīm̐punane vuṁḍam̐gānu
siṁtiṁche vĕvvarinoyi sigguvaḍaga
dŏṁtim̐ bĕṭṭi rusulĕllā dŏragi tamaguṁḍinā
siṁtagāya ganum̐gŏṁṭe seri norūruduru
(||nīve||)
siṁgārabum̐ dŏḽaśhamma śhirasubai nuṁḍam̐gānu
muṁgiḍa nĕvvarigoyi mohiṁchevu
iṁgidāna śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
aṁgaḍiberāla kŏsaraḍugaga mānaru