Nee vemi seduve ni nnimta sese nadamdu

నీ వేమి సేతువే ని న్నింత సేసె నతఁడు
Language

(॥పల్లవి॥)
నీ వేమి సేతువే ని న్నింత సేసె నతఁడు
రావిఁ జూచెదో బొమ్మరాకాశిఁ జూతురో

(॥నీవేమి॥)
చెప్పుకువే ని న్నాతఁడు చేరి పెద్ద సేయఁగాను
వుప్పుగప్పురము లాయ నో యమ్మ
ముప్పిరి నేమి చూచేవే ముందరిచెవులకంటే
గొప్పలై వెనకవచ్చే కొమ్ములు వాఁడాయనే

(॥నీవేమి॥)
నగకువే నీ కతఁడు నంటునఁ జన వియ్యఁగా
చిగురున కెక్కెఁ జాగ చెల్లు నమ్మా
తగుఁ దగ దన నేల దాని కేమి పైఁడితో
జగములో గురిగింజ సరిఁ దూఁగెఁ గదవే

(॥నీవేమి॥)
నిలువు రాజస మేలే ని న్నాతఁడు గూడఁగాను
కలి దచ్చ వెన్నాయఁ గదవమ్మా
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలో నన్నుఁ గలసె
మలసి మయిలవోయి మణుఁగాయఁ గదవే

(||pallavi||)
nī vemi seduve ni nniṁta sesĕ nadam̐ḍu
rāvim̐ jūsĕdo bŏmmarāgāśhim̐ jūduro

(||nīvemi||)
sĕppuguve ni nnādam̐ḍu seri pĕdda seyam̐gānu
vuppugappuramu lāya no yamma
muppiri nemi sūseve muṁdarisĕvulagaṁṭe
gŏppalai vĕnagavachche kŏmmulu vām̐ḍāyane

(||nīvemi||)
nagaguve nī kadam̐ḍu naṁṭunam̐ jana viyyam̐gā
siguruna kĕkkĕm̐ jāga sĕllu nammā
tagum̐ daga dana nela dāni kemi paim̐ḍido
jagamulo gurigiṁja sarim̐ dūm̐gĕm̐ gadave

(||nīvemi||)
niluvu rājasa mele ni nnādam̐ḍu gūḍam̐gānu
kali dachcha vĕnnāyam̐ gadavammā
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nannum̐ galasĕ
malasi mayilavoyi maṇum̐gāyam̐ gadave