నీ వేమి సేతువయ్య నీవంకఁ గడమేది
(॥పల్లవి॥)
నీ వేమి సేతువయ్య నీవంకఁ గడమేది
వేవేలు సిరులెకా వేడుకలు సేసేవి
(॥నీవేమి॥)
తరుణిఁ గాఁగిటఁ గూడి దగదొట్టినవాఁడవు
యిరవుగా నెఱఁగవా యీపెగురుతు
ఎరవులవానివలె యిప్పుడు పేరడిగేవు
దొరతన మిదేకా యిందుల బ్రమయించేది
(॥నీవేమి॥)
చెలరేఁగి యీపెమీఁద సేసవెట్టినవాఁడవు
తెలియవా యేమైనా మతిలో గుణము
లలిఁ గొత్తవానివలెఁ దలఁచుకొనేవు నీవు
నిలువు గర్వమేకా నిన్నింత సేసేది
(॥నీవేమి॥)
వూని యలమేలుమంగ వురముతోడివాఁడవు
కానవా నీ వేమైనా చక్కఁదనములు
కానీలే శ్రీవేంకటేశ గరిసించేవప్పటిని
ఆనుకొన్నమనమేకా ఆయాలు సోఁకించేది
(||pallavi||)
nī vemi seduvayya nīvaṁkam̐ gaḍamedi
vevelu sirulĕgā veḍugalu sesevi
(||nīvemi||)
taruṇim̐ gām̐giḍam̐ gūḍi dagadŏṭṭinavām̐ḍavu
yiravugā nĕṟam̐gavā yībĕgurudu
ĕravulavānivalĕ yippuḍu peraḍigevu
dŏradana midegā yiṁdula bramayiṁchedi
(||nīvemi||)
sĕlarem̐gi yībĕmīm̐da sesavĕṭṭinavām̐ḍavu
tĕliyavā yemainā madilo guṇamu
lalim̐ gŏttavānivalĕm̐ dalam̐sugŏnevu nīvu
niluvu garvamegā ninniṁta sesedi
(||nīvemi||)
vūni yalamelumaṁga vuramudoḍivām̐ḍavu
kānavā nī vemainā sakkam̐danamulu
kānīle śhrīveṁkaḍeśha garisiṁchevappaḍini
ānugŏnnamanamegā āyālu som̐kiṁchedi